Tamannaah : రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోలు అలా ఉంటారు.. చాలా కష్టం..

తాజాగా ఓ బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోలు ఎలా ఉంటారు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమన్నా మాట్లాడుతూ..................

Tamannaah : రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోలు అలా ఉంటారు.. చాలా కష్టం..

Tamannaah comments on romantic scenes in movies

Updated On : December 31, 2022 / 6:53 AM IST

Tamannaah :  ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు అవుతున్నా ఇంకా హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తోంది తమన్నా. ఇప్పటికి కూడా తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తెచ్చుకుంటుంది ఈ మిల్కీ భామ. ఇటీవల బాలీవుడ్ లో వరుస సినిమాలు రిలీజ్ చేసింది. త్వరలో చిరంజీవి సరసన తెలుగులో భోళా శంకర్ సినిమాతో రాబోతుంది.

Sankranthi Movies : ఈ సారి సంక్రాంతి దిల్ రాజు వర్సెస్ టాలీవుడ్.. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా దిల్ రాజు తీసుకున్నాడా ??

తాజాగా ఓ బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోలు ఎలా ఉంటారు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమన్నా మాట్లాడుతూ.. చాలామంది రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోలు ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. కానీ అది తప్పు. రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి హీరోలు అస్సలు ఇష్టపడరు. అందరి ముందు రొమాంటిక్ సీన్స్ చేయడం చాలా కష్టం, అది మాకే కాదు హీరోలకి కూడా. ఇక సిగ్గు, మొహమాటం ఉన్న కొంతమంది హీరోలైతే ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు కనీసం మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడతారు. సినిమా మొత్తం మీద హీరోలు రొమాంటిక్ సీన్స్ లోనే చాలా కష్టపడతారు, ఆ సీన్స్ అంత త్వరగా అవ్వవు. చాలా మంది హీరోలు రొమాంటిక్ సీన్స్ చేయడానికి ఆసక్తి చూపించరు అని తెలిపింది. తమన్నా చెప్పిన ఈ మాటలు విని అవునా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.