నిత్యానంద కైలాసానికి వెళతాను…. మీరా మిథున్

  • Published By: murthy ,Published On : August 28, 2020 / 07:52 AM IST
నిత్యానంద కైలాసానికి వెళతాను…. మీరా మిథున్

Updated On : August 28, 2020 / 9:54 AM IST

తమిళనాడులో బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ ఈమధ్యన సంచలనాలకు నెలవుగా మారి తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన వివాదాస్పద వ్యాఖ్యలతో కోలీవుడ్ లోని స్టార్ హీరోలపై సైతం వ్యాఖ్యలు చేసింది. ఈ అమ్మడి దృష్టి ఇప్పుడు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందపై  పడింది.




meera mithun bigg bossత్వరలో తాను నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నానని మీరామిథున్‌ తెలిపారు. నిత్యానంద ఇప్పుడు తనే సొంతంగా కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏలుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

నటి మీరామిథున్‌ ఇటీవల ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది. నిత్యానంద గురించి ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ అందరూ ఆయన్ని తప్పుగా ప్రచారం చేశారు. త్వరలో తాను నిత్యానంద ఏర్పాటుచేసిన కైలాస దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నాను. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌ అని మీరా మిథున్‌ ట్వీట్ చేసింది.


కాగా …కాంట్రవర్సీ యాక్ట్రెస్ అనే ముద్ర వేయించుకున్న మీరా మిధున్ ఇటీవల సూపర్‌స్టార్‌ రజినీకాంత్, ఇళయ దళపతి, హీరో సూర్య లపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. స్టార్స్ పై మీరా మిధున్ వ్యాఖ్యలు చేయడంను నెటిజన్స్ తీవ్రంగా తప్పుపట్టారు.



meera mithun

సోషల్ మీడియాలో ఆమెను బండ బూతులు తిడుతూ ట్రోల్స్ చేసారు. ఈ క్రమంలో చెన్నైలో విజయ్ మరియు సూర్య అభిమానులం అంటూ కలామ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మీరా మిథున్ దిష్టి బొమ్మను తగులబెట్టారు. నటుడువిశాల్ తనను పెళ్ళి చేసుకుంటానని రెండు మూడేళ్ళుగా తన వెంట పడ్డాడని కూడా ఆమె వ్యాఖ్యానించింది.



meera mithun 2

మరోవైపు త్రిష కి కుల పిచ్చి అని, తనకు ఎదగడం కోసం తనలాంటి ఆర్టిస్ట్ లను ఎదగనియ్యదని, ఇండస్ట్రీలో తనని తొక్కేయ్యడానికి త్రిష ప్రయత్నించింది అంటూ కూడా స్టేట్ మెంట్లిచ్చింది గతంలో. మీరామిథున్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను తీవ్రంగా హెచ్చరించారు.