Sardar 2 : సర్దార్ 2 పై అప్డేట్ ఇచ్చిన కార్తీ.. వీడియో ట్వీట్ వైరల్..

తమిళ్ స్టార్ హీరో కార్తీ సర్దార్ 2 కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నేటితో ఈ మూవీ ఏడాది పూర్తి చేసుకోవడంతో.. కార్తీ ఒక ట్వీట్ చేశాడు.

Sardar 2 : సర్దార్ 2 పై అప్డేట్ ఇచ్చిన కార్తీ.. వీడియో ట్వీట్ వైరల్..

Tamil Hero Karthi gave update on Sardar 2 movie

Updated On : October 21, 2023 / 7:56 PM IST

Sardar 2 : తమిళ్ స్టార్ హీరో కార్తీ గత ఏడాది ‘సర్దార్’ మూవీతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న విషయం తెలిసిందే. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీ డ్యూయల్ రోల్ చేశాడు. రాశిఖన్నా, రజీషా హీరోయిన్స్ గా నటించారు. గత ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ అయ్యి తమిళ్, తెలుగులో సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఆ సినిమా చివర్లోనే సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి వదిలేశారు. దీంతో సర్దార్ 2 కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సీక్వెల్ కి సంబంధించిన పనులు కూడా 2022 లోనే మొదలు పెట్టేశారు. దర్శకుడు మిత్రన్ మూవీకి స్క్రిప్ట్ పై కసరత్తులు చేయడం మొదలు పెట్టారని, త్వరలోనే సర్దార్ కొత్త మిషన్ మొదలవుతుందని పేర్కొన్నారు. ఆ ప్రకటన తరువాత మళ్ళీ మరో అప్డేట్ మూవీ టీం నుంచి రాలేదు. ఇక నేటితో (అక్టోబర్ 21) ఈ మూవీ ఏడాది పూర్తి చేసుకోవడంతో.. కార్తీ ఒక ట్వీట్ చేశాడు. “ఒక మైల్ స్టోన్ గా నిలిచిన సర్దార్ కి వన్ ఇయర్ పూర్తి అయ్యింది. సర్దార్ 2 లోడింగ్ సూన్” అంటూ రాసుకొచ్చాడు.

Also read : Tiger Nageswara Rao : ఆ విషయంలో వెనక్కి తగ్గిన టైగర్ నాగేశ్వరరావు.. ఆడియన్స్‌కి మరింత థ్రిల్..!

అలాగే సర్దార్ రిలీజ్ సమయంలోని ఆడియన్స్ రివ్యూలను ఒక వీడియో రూపంలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. కాగా సర్దార్ కథ విషయానికి వస్తే.. వాటర్ మాఫియాపై, వాటర్ బాటిల్స్ వల్ల కలిగే అనారోగ్యాలని థ్రిల్లింగ్ గా చూపించారు. మరి సెకండ్ పార్ట్ లో ఏ సమస్యని చూపిస్తారో చూడాలి. ఇక ఫస్ట్ పార్ట్ లో కథ మొత్తం తండ్రి పాత్ర అయిన కార్తీ చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ పార్ట్ చివరిలో కొడుకు కార్తీ కూడా ఇండియన్ స్పై ఏజెంట్ గా మారినట్లు చూపించారు. దీంతో సెకండ్ పార్ట్ మొత్తాన్ని కొడుకు కార్తీ పాత్ర ముందుకు తీసుకు వెళ్లనుందని తెలుస్తుంది.