Siva Karthikeyan : మూడో సారి తండ్రి అయిన హీరో.. మళ్ళీ బాబు పుట్టాడు అంటూ పోస్ట్..

తాజాగా శివ కార్తికేయన్ తనకు బాబు పుట్టాడు అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

Siva Karthikeyan : మూడో సారి తండ్రి అయిన హీరో.. మళ్ళీ బాబు పుట్టాడు అంటూ పోస్ట్..

Tamil Hero Siva Karthikeyan Blessed with Baby Boy Third Time he became Father

Updated On : June 4, 2024 / 7:21 AM IST

Siva Karthikeyan : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తమిళ్ లో ఆర్జే నుంచి యాంకర్ నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు శివ కార్తికేయన్. తమిళ్ లో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. తన డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు శివ కార్తికేయన్. ఈ స్టార్ హీరో ఫ్యామిలీకి కూడా ఎక్కువ సమయం ఇస్తాడు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కూడా ఫ్యామిలీ ఫోటోలు పోస్ట్ చేస్తాడు.

Also Read : Kalki 2898AD : కల్కి సినిమాలో ఆ ఇద్దరు హీరోయిన్స్ కూడా గెస్ట్ అప్పీరెన్స్.. ఇంతమంది స్టార్లు నిజమేనా?

తాజాగా శివ కార్తికేయన్ తనకు బాబు పుట్టాడు అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. శివ కార్తికేయన్ 2010లో తన చుట్టాలమ్మాయి ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. 2013లో వీళ్లకు ఆరాధాన అనే పాప పుట్టింది. ఈ పాప చైల్డ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా కూడా అలరిస్తుంది. 2021లో గుగున్ అనే అబ్బాయి పుట్టాడు ఈ జంటకు. తాజాగా ఈ జంట ముచ్చటగా మూడోసారి తల్లిదండ్రులయ్యారు. శివ కార్తికేయన్ కి బాబు పుట్టినట్టు తన సోషల్ మీడియాలో తెలపడంతో అభిమానులు, పలువురు నెటిజన్లు శివకార్తికేయన్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.