Kollywood : ఆ నాలుగు హీరోలకు తమిళనాడులో నిషేధం.. నిర్మాత మండలి నిర్ణయం..!
తమిళ్ సినిమా పరిశ్రమలో నాలుగు హీరోల పై నిషేధం. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలనం నిర్ణయం.

tamil industry Prohibition on vishal Silambarasan Dhanush Atharvaa
Kollywood : తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నలుగురు స్టార్ హీరోలకు షాక్ ఇచ్చింది. నిర్మాతలకు సహకరించలేదనే ఆరోపణల వలనే ఆ నాలుగు హీరోలకి రెడ్ కార్డ్ ఇవ్వాలని అసోసియేషన్ నిర్ణయించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ధనుశ్, విశాల్, శింబు, అథర్వ.. ఇక పై ఏ మూవీలో నటించకుండా తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ రెడ్ కార్డ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారట.
Vijay Deverakonda : వంద కుటుంబాలను సెలెక్ట్ చేసిన విజయ్.. ఇక లక్ష ఇవ్వడమే..
ప్రొడ్యూసర్ అసోసియేషన్‌కు విశాల్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధులను దుర్వినియోగం చేశాడని ఆరోపణలతో అతడికి రెడ్ కార్డు ఇవ్వనున్నారు. అలాగే నిర్మాత మైఖేల్ రాయప్పన్ తో వివాదం విషయంలో శింబుని ఎన్ని సార్లు చర్చకి పిలిచినా రాకపోవడంతో రెడ్ కార్డు ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఇక ధనుష్ ఒకే చేసిన ఒక మూవీ షూటింగ్ 80 శాతం పూర్తయ్యాక.. మిగిలిన షూట్ కి తాను సహకరించకపోవడంతో తనపై కూడా వేటు వేస్తున్నారు. అలాగే అథర్వ కూడా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో సినిమా ఒకే చేసి.. దాని షూటింగ్ కి సహకరించడం లేదని ఆరోపణలతో రెడ్ కార్డు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
Shah Rukh Khan : అల్లు అర్జున్ ట్వీట్‌కి షారుఖ్ రిప్లై.. ఫైరే నన్ను పొగుడుతుంది..
కాగా వీరితో పాటు మరికొందరు నటీనటులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. ఈ నిషేధం విషయం పై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కొన్ని నెలలు క్రిందటే నిర్ణయం తీసుకుందట. మరి ఈ రెడ్ కారు ఇష్యూ పై ఆయా హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ విషయం అయితే అటు తమిళ్, ఇటు తెలుగులో హాట్ టాపిక్ అయ్యింది.