Ajith – Siva : ఆ స్టార్ హీరో – డైరెక్టర్ కాంబో ఇప్పటికే నాలుగు హిట్లు.. ఇప్పుడు ఐదోసారి రిపీట్..

రేర్ కాంబో అజిత్ కుమార్ అండ్ శివ ఈ ఇద్దరూ ఇప్పటి వరకూ నాలుగు సూపర్ హిట్ మూవీస్ తో ఫ్యాస్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేశారు.

Ajith – Siva : ఆ స్టార్ హీరో – డైరెక్టర్ కాంబో ఇప్పటికే నాలుగు హిట్లు.. ఇప్పుడు ఐదోసారి రిపీట్..

Tamil star hero Ajith Kumar combination with Siva again for their 5th movie

Updated On : June 22, 2023 / 9:36 AM IST

Ajith – Siva :  కొన్ని సూపర్ హిట్ కాంబోస్ కు ఎప్పుడూ సూపర్ క్రేజుంటుంది. ఈ కాంబినేషన్ లో మూవీస్ పదే పదే రావాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. అలాంటి ఒక రేర్ కాంబో అజిత్ కుమార్ అండ్ శివ. ఈ ఇద్దరూ ఇప్పటి వరకూ నాలుగు సూపర్ హిట్ మూవీస్ తో ఫ్యాస్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేశారు. తెలుగులో కెమెరామెన్ గా కెరీర్ మొదలుపెట్టిన శివ ఆ తర్వాత ఇక్కడే డైరెక్టర్ గా మారి శంఖం, శౌర్యం, దరువు సినిమాలు తీసి తమిళ్ కి చెక్కేశాడు. తమిళ్ లో అజిత్ తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం అంటూ వరుసగా నాలుగు సినిమాలు తీసి నాలుగు మంచి హిట్స్ సాధించాడు. అందులో విశ్వాసం సినిమా యిక్కడ కూడా డబ్బింగ్ లో రిలీజయి మంచి విజయం సాధించింది.

ఇప్పుడు ఇధే కాంబినేషన్ లో 5వ సినిమా రాబోతుండడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. అజిత్ ప్రీవియస్ గా సంక్రాంతికి తెగింపు సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించాడు. దీని తమిళ వెర్షన్ ‘తునివు’కు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు అజిత్ తన కెరీర్ లో 62వ సినిమాలో నటిస్తున్నాడు. సినిమా పేరు ‘విడాముయర్చి’. దీనికి మగిళ్ తిరుమేని డైరెక్టర్. ఈ సినిమా ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా హైయస్ట్ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటోంది. ఇందులో అజిత్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కంప్లీట్ అయ్యాకా అజిత్ నటించేది శివ డైరెక్షన్.

Sobhita Dhulipala : శోభితకు కాబోయే వరుడు ఇలా ఉండాలంట.. మరోసారి నాగచైతన్యతో రూమర్స్‌పై స్పందించిన శోభిత..

డైరెక్టర్ శివ ప్రస్తుతం మరో స్టార్ హీరో సూర్యతో ఫస్ట్ టైమ్ కొలాబరేట్ అవుతూ.. ‘కంగువ’ అనే పీరియాడికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో సూర్య యోధుడిగా అదిరిపోయే గెటప్ లో నటిస్తున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే శివ అజిత్ సినిమా వర్క్ మొదలుపెడతారు. ఈ ఇద్దరూ తమ కమిట్మెంట్స్ పూర్తి చేసుకున్న తర్వాత వీరి కాంబోలోని 5వ సినిమా తెరకెక్కబోతోంది. దీంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు పెంచుకుంటున్నారు. వీరి కాంబోలో వచ్చే 5వ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు.