Tamil Movies : 2024లో పాన్ ఇండియా సినిమాలంటూ చేతులు కాల్చుకున్న తమిళ సినీ పరిశ్రమ..

ఏదో ఒకటీ అరా హిట్ అయినంత మాత్రాన అన్ని సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా వర్కవుట్ కావు.

Tamil Movies : 2024లో పాన్ ఇండియా సినిమాలంటూ చేతులు కాల్చుకున్న తమిళ సినీ పరిశ్రమ..

Tamil Star Movies Failed as Pan Indian Movies in 2024

Updated On : December 26, 2024 / 8:55 PM IST

Tamil Movies : బాహుబలి బ్లాక్ బస్టర్ అయ్యిన దగ్గరనుంచి అందరూ పాన్ ఇండియా పాట పాడుతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా తెలుగు సినిమా రీచ్ అవ్వాలని కోరుకోవడం తప్పులేదు కానీ అసలు పాన్ ఇండియా ఎలిమెంట్స్ లేకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యడం ఎంత వరకూ కరెక్ట్. అలా పాన్ ఇండియా రీచ్ అవుదామని ఈ సంవత్సరం చాలా తమిళ సినిమాలు బొక్కబోర్లా పడ్డాయి.

పాన్ ఇండియా సినిమా అంటే అంత ఈజీ కాదు. పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని ఆకట్టుకునే కథ ఉండాలి. ఆడియన్స్ ని ఆకట్టుకునే ఎమోషన్స్ ఉండాలి. అప్పుడే కథకు కనెక్ట్ అయ్యి సినిమా హిట్ అవుతుంది. అంతేకానీ టాప్ డైరెక్టర్ అయ్యినంత మాత్రాన, స్టార్ హీరోతో సినిమాలు చేసినంత మాత్రాన పాన్ ఇండియా వైడ్ గా హిట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. తమిళ్ హీరోలు ఎక్కువగా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏదో ఒకటీ అరా హిట్ అయినంత మాత్రాన అన్ని సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా వర్కవుట్ కావు.

Also Read : Chiranjeevi – CM Meeting : సీఎంతో మీటింగ్ కి ‘మెగా’ దూరం.. చిరంజీవి ఎందుకు రాలేదు..?

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో దాదాపు పాతికేళ్ల తర్వాత భారతీయుడు 2 సీక్వెల్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా వైడ్ గా రిలీజైన ఈ సినిమా తమిళ్ తప్ప మిగిలిన లాంగ్వేజెస్ లో జనానికి అసలు ఎక్కలేదు. తమిళ్ లో కూడా ఏదో పర్వాలేదనిపించింది. భారతీయుడు లాంటి పవర్ ఫుల్ స్టోరీకి పనిగట్టుకుని సీక్వెల్ చెయ్యడం, అది బలవంతంగా పాన్ ఇండియా ఆడియన్స్ మీద రుద్దడంతో సినిమా ఏమాత్రం వర్కవుట్ కాలేకపోయింది.

రజనీకాంత్ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కి నేషనల్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ఉంది. అలా అని ఆయన చేసిన సినిమాలన్నీ హిట్ కావు. ఒక వేళ తమిళ్ లో హిట్ అయినా రీచ్ అయ్యే కంటెంట్ లేకపోతే మిగిలిన లాంగ్వేజెస్ లో వర్కవుట్ కావు. అలా భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన వేట్టయన్ పాన్ ఇండియా ఆడియన్స్ ని రీచ్ కాలేకపోయింది.

ఒక వైపు పాలిటిక్స్, మరో వైపు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఈ సంవత్సరం ద గోట్ మూవీ ని రిలీజ్ చేశారు. ఎన్నో అంచనాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ద గోట్ మూవీ విజయ్ అంచనాల్ని తలకిందులుచేసింది. అంతేకాదు పాన్ ఇండియా వైడ్ రీచ్ సంగతి పక్కనపెడితే కనీసం పక్కనున్న తెలుగులో కూడా సినిమా ఆడలేదు. విజయ్ ని తమిళ్ లో తప్ప మిగిలిన ఆడియన్స్ ఆదరించకపోవడంతో ఇండియా వైడ్ గా ఆకట్టుకోలేకపోయింది.

Also Read : Allu Arjun – Pushpa 2 Collections : అల్లు అర్జున్ నెక్స్ట్ టార్గెట్ బాహుబలి 2.. కలెక్షన్స్ విషయంలో అది కూడా బ్రేక్ చేస్తాడా?

దాదాపు రెండేళ్ల నుంచి వెయిట్ చేసిన సూర్య కంగువ సినిమాని ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశారు. చాలా ఎఫర్ట్ పెట్టి భారీ బడ్జెట్ తో తెరకెక్కి సరికొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కి చూపించిన కంగువ తమిళ్ లో మంచి టాక్ తెచ్చుకుంది కానీ పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. తెలుగులో కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్స్ కూడా రాబట్టలేదు.

విక్రమ్ హీరోగా వచ్చిన తంగలాన్ పరిస్థితి కూడా అంతే. విక్రమ్ కంప్లీట్ మేకోవర్ తో పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా తమిళ్,తెలుగు ఆడియన్స్ కి మాత్రమే పరిమితమైంది. బాలీవుడ్ లో మార్కెట్ చేసుకుందామన్న విక్రమ్ ఆలోచనలకి బ్రేక్ వేసింది. తెలుగులో కూడా కాంప్లిమెంట్స్ వచ్చినా కలెక్షన్స్ రాలేదు. ఇలా ఈ సంవత్సరం తెలుగు వాళ్ళను చూసి పాన్ ఇండియా సినిమాలు అంటూ తమిళ్ వాళ్ళు భారీగానే చేతులు కాల్చుకున్నారు.