VA Durai : స్టార్ ప్రొడ్యూసర్ కన్నుమూత.. చివరి దశలో చికిత్సకు డబ్బులు లేక..

తమిల్ లో సేతు, బాబా, శివపుత్రుడు, గజేంద్ర.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలని నిర్మించారు నిర్మాత వీఏ దురై. గజేంద్ర సినిమా తర్వాత సినిమాలకు దూరమయ్యారు వీఏ దురై.

VA Durai : స్టార్ ప్రొడ్యూసర్ కన్నుమూత.. చివరి దశలో చికిత్సకు డబ్బులు లేక..

Tamil Star Producer VA Durai Passed Away at the age of 59 due to health Issues

VA Durai :  ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు మరణించి పరిశ్రమలో తీవ్ర విషాదం నింపుతున్నారు. తమిళ పరిశ్రమలో ఇటీవలే హీరో విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్యని మరిచిపోకముందే తాజాగా ఓ నిర్మాత కన్నుమూశారు.

తమిల్ లో సేతు, బాబా, శివపుత్రుడు, గజేంద్ర.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలని నిర్మించారు నిర్మాత వీఏ దురై. గజేంద్ర సినిమా తర్వాత సినిమాలకు దూరమయ్యారు వీఏ దురై. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల కొన్ని నెలల క్రితం తనని ఆర్ధికంగా ఆదుకోవాలని, కష్టాల్లో ఉన్నాను అని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అవ్వగా పలువురు తమిళ ప్రముఖులు సహాయం చేశారు.

Also Read : Balakrishna : NBK109 సినిమా నుండి అదిరిపోయే అప్డేట్.. సెకండాఫ్ 40 నిముషాలు.. కానీ ఏపీ పాలిటిక్స్ వల్ల..

గత కొంత కాలంగా ఇంట్లోనే చికిత్స పొందుతూ నేడు తెల్లవారు జామున 59 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. చివరిదశలో చికిత్సకు కావాల్సినంత డబ్బులు లేక మరణించారని సమాచారం. వీఏ దురై మరణంతో తమిళ పరిశ్రమలో విషాదం నెలకొనగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.