Tanikella Bharani : దళపతి సినిమా ఛాన్స్ మిస్ అయింది.. కొన్ని సినిమాలు వదులుకొని మరీ ఈ సినిమాకి డైలాగ్స్ రాశాను..
ప్రెస్ మీట్ లో తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ''25 సంవత్సరాల తరువాత పెన్ను పట్టుకొని మణిరత్నం సినిమాకి డైలాగ్స్ రాశాను. దళపతి సినిమాలో ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చి చేజారిపోయింది. ఇన్నాళ్ళకి మణిరత్నం సినిమాలో............

Tanikella Bharani speech in chola chola song from Ponniyin Selvan Movie release Event
Tanikella Bharani : మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సెప్టెంబర్ 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష.. లాంటి స్టార్లతో పాటు ఎంతోమంది ప్రముఖులు నటించారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించగా తెలుగులో దిల్‌రాజు రిలీజ్ చేయబోతున్నారు. శుక్రవారం సాయంత్రం పొన్నియన్ సెల్వన్ లోని చోళ చోళ… అంటూ సాగే పాటని హైదరాబాద్‌లో విడుదల చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ లో తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ”25 సంవత్సరాల తరువాత పెన్ను పట్టుకొని మణిరత్నం సినిమాకి డైలాగ్స్ రాశాను. దళపతి సినిమాలో ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చి చేజారిపోయింది. ఇన్నాళ్ళకి మణిరత్నం సినిమాలో అవకాశం వచ్చింది అది కూడా రచయితగా. ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు మణి గారు కాల్ చేసి ఈ సినిమాకు డైలాగ్స్ రాయమన్నారు. నేను కూడా ఈ సినిమాకి తెలుగులో డైలాగ్స్ రాయడానికి రీసెర్చ్ చేశాను. అందరూ కలలు కంటారు, కానీ అది సాకారం చేసుకున్నారు మణిరత్నం గారు. నేను కొన్ని సినిమాలు వదులుకొని మరీ ఈ సినిమాకు డైలాగ్స్ రాశాను. ఈ సినిమాలో క్యారెక్టర్లు కనపడుతాయి కానీ హీరోలు కనపడరు. ఇది చాలా అద్భుతమైన సినిమా. విక్రమ్ చిన్న సినిమాలు చేస్తూ ఈ రోజు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు. జయరామ్ చేసిన నంబి క్యారెక్టర్ కు నేనే డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ చరిత్రలోకి వెళ్ళిపోతాము” అని తెలిపారు.