TBD OTT : 10 రూపాయలకే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్.. త్వరలో సరికొత్త ఓటీటీ..

ఇప్పుడు ఇండియన్ ఓటీటీ పరిశ్రమలోకి మరో కొత్త ఓటీటీ వచ్చేస్తుంది.(TBD OTT)

TBD OTT : 10 రూపాయలకే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్.. త్వరలో సరికొత్త ఓటీటీ..

TBD OTT

Updated On : November 14, 2025 / 6:43 AM IST

TBD OTT : ఇప్పుడుసినిమా థియేటర్స్ కంటే కూడా ఓటీటీలోనే ఎక్కువ సక్సెస్ అవుతుంది. వివిధ ఓటీటీలలో అనేక వేల సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రపంచంలోని అన్ని సినిమాలను ఓటీటీ ద్వారా చూసేయొచ్చు. తెలుగులో ప్రత్యేకంగా కూడా ఆహా, ఈటీవీ విన్ లాంటి ఓటీటీలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ ఓటీటీ పరిశ్రమలోకి మరో కొత్త ఓటీటీ వచ్చేస్తుంది.(TBD OTT)

దుబాయ్‌ కేంద్రంగా నడుస్తున్న రాయల్‌ ర్యాప్చీ సంస్థ ఆధ్వర్యంలో ఇటీవలే దుబాయ్‌లో ఘనంగా లాంచ్‌ అయిన ‘టీబీడీ’ ఓటీటీ ఇప్పుడు భారతదేశంలో మొదలుకానుంది. హైదరాబాద్‌లో తాజాగా ‘టీబీడీ’ (త్రిభాణధారి) ఓటీటీ లోగో లాంచ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ ఫౌండర్‌, ఎండీ ధరమ్‌ గుప్తా, సీఈఓ సునీల్‌ భోజ్వానీ, సౌత్‌ ఇండియా సీఈఓలు, నటుడు, నిర్మాత డి.యస్‌.రావు, డైరెక్టర్ వి. సముద్రతో పాటు దర్శకులు వి.యన్‌. ఆదిత్య, చంద్రమహేష్‌, ఇ. సత్తిబాబు, శివనాగు, నిర్మాత కె.కె. రాధామోహన్‌.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Also Read : Kaantha Review : ‘కాంత’ మూవీ రివ్యూ.. సినిమాలో సినిమా.. పీరియాడికల్ డ్రామా అదిరిందిగా..

టీబీడీ ఓటీటీ లోగో లాంచ్ అనంతరం ఫౌండర్‌, ఎండీ ధరమ్‌గుప్తా మాట్లాడుతూ.. టీబీడీని భారతీయ మూలాలకు విస్తరించాలనేది మా ఆకాంక్ష. ఇందులో మన దేశీ కంటెంట్‌ మాత్రమే ఉంటుంది. అడల్ట్ కంటెంట్‌ తప్ప అన్నీ ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే విధంగా ఉంటాయి. ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ కేవలం 10 రూపాయలు మాత్రమే. కొత్త సినిమాలు, పాత సినిమాలు ఎవరైనా మా ఓటీటీలో పెట్టడానికి సంప్రదించండి. ఓటీటీలో ఇప్పటికే చాలా ఫ్లాట్‌ఫామ్స్‌ ఉన్నా ఇంకా చాలా స్పేస్‌ ఉంది. చిన్న నిర్మాతలకు పెద్ద పీట వేస్తాం. పేమెంట్‌ విషయంలో కూడా ఖచ్చితంగా ఉంటాం అని తెలిపారు.

టిబిడి సౌత్‌ సీఈఓల్లో ఒకరైన డి.యస్‌. రావు మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా ఎన్నో అనుభవాలను చూశాను. ఓటీటీ బిజినెస్‌ విషయంలో చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓటీటీకి సినిమా ఎలా అమ్మాలి, ఎవరిని కలవాలో తెలియడం లేదు. ఇలాంటి టైమ్‌లో ఈ టిబిడి ఓటీటీ రావడం, దీనికి నేను సముద్రగారు బాధ్యులుగా ఉండటం సంతోషంగా ఫీలవుతున్నాను అన్నారు.

Also Read : Love OTP Review : ‘లవ్ ఓటీపీ’ మూవీ రివ్యూ.. వామ్మో గర్ల్ ఫ్రెండ్ టార్చర్ మాములుగా లేదుగా..

టిబిడి సౌత్‌ సీఈఓల్లో ఒకరైన వి. సముద్ర మాట్లాడుతూ.. టిబిడి ఓటీటీ దుబాయ్‌ బేస్డ్‌గా ఉన్నప్పటికీ ప్రపంచమంతా పనిచేస్తుంది. రాబోయే కాలంలో పెద్ద ఓటీటీల్లో ఒకటి అవుతుంది. ఓటీటీ బిజినెస్‌ విషయంలో నిర్మాతలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు పరిష్కారమే మా మా టిబిడి ఓటీటీ.

TBD OTT

ముఖ్య అతిథి కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ.. ఈ ఓటీటీ చిన్న, పెద్ద నిర్మాతలకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. నిర్మాతలు, దర్శకులు కూడా మంచి కంటెంట్‌ ఇవ్వాలి. చాలా తక్కువ సబ్‌స్క్రిప్షన్‌తో అడుగు పెడుతున్న టిబిడి కి శుభాకాంక్షలు అని అన్నారు.