రియల్ స్టార్ ఉపేంద్ర ‘మీసం’
రియల్ స్టార్ ఉపేంద్ర, వేదిక జంటగా నటిస్తున్న కన్నడ సినిమా.. 'హోమ్ మినిస్టర్'.. తెలుగులో 'మీసం' పేరుతో విడుదల కానుంది..

రియల్ స్టార్ ఉపేంద్ర, వేదిక జంటగా నటిస్తున్న కన్నడ సినిమా.. ‘హోమ్ మినిస్టర్’.. తెలుగులో ‘మీసం’ పేరుతో విడుదల కానుంది..
రియల్ స్టార్ ఉపేంద్ర, వేదిక జంటగా నటిస్తున్న కన్నడ సినిమా.. ‘హోమ్ మినిస్టర్’.. శ్రీ హరి నాను దర్శకత్వంలో, శ్రీయాస్ చిత్ర బ్యానర్‌పై.. పూర్ణ చంద్ర నాయుడు, శ్రీకాంత్ వి. నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 18 ఉపేంద్ర బర్త్‌డే సందర్భంగా ‘హోమ్ మినిస్టర్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఉపేంద్ర మరో వెరైటీ కథతో, తన స్టైల్ డిఫరెంట్ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ను అలరించనున్నాడని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. మోషన్ పోస్టర్ వీడియోకు జిబ్రాన్ కంపోజ్ చేసిన ఆర్ఆర్ బాగుంది. ‘హోమ్ మినిస్టర్’ మూవీని తెలుగులో ‘మీసం’ పేరుతో విడుదల చెయ్యనున్నారు. ఈ మేరకు ఉపేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. తెలుగు వెర్షన్ పోస్టర్ విడుదల చేశారు నిర్మాతలు.
ఆద్య, సాధు కోకిల, అవినాష్ తదితరులు నటిస్తున్న ‘హోమ్ మినిస్టర్’ అండ్ ‘మీసం’ అక్టోబర్ 18న కన్నడ, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సినిమాటోగ్రఫీ : కుంజుని ఎస్ కుమార్, ఎడిటింగ్ : ఆంటోని, మ్యూజిక్ : జిబ్రాన్, లిరిక్స్ : చంద్రబోస్.