HanuMan : స్టార్ హీరో చిత్రం స్థాయిలో హనుమాన్ ప్రీమియర్ షోలు.. అమెరికా ప్రీమియర్ కలెక్షన్స్ అదుర్స్..

ఒక స్టార్ హీరో సినిమాకి పడినన్న ప్రీమియర్స్.. హనుమాన్ చిత్రానికి పడ్డాయి. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు అమెరికాలో కూడా..

HanuMan : స్టార్ హీరో చిత్రం స్థాయిలో హనుమాన్ ప్రీమియర్ షోలు.. అమెరికా ప్రీమియర్ కలెక్షన్స్ అదుర్స్..

Teja Sajja Prashanth Varma Hanuman Movie Premiers record

Updated On : January 12, 2024 / 7:35 AM IST

HanuMan : టాలీవుడ్ యంగ్ టాలెంట్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కలిసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. రామ భక్తుడు హనుమంతుడి వల్ల ఓ కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే.. ఆ కథ ఎలా ఉంటుందో దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా చూపించాడంటూ ప్రీమియర్స్ చూసిన వారు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ రివ్యూని ఇస్తున్నారు.

కాగా ఈ మూవీకి ఓ రేంజ్ ప్రీమియర్స్ పడ్డాయి. చిన్న హీరో చిన్న సినిమాగా మొదలైన ఈ ప్రాజెక్ట్.. టీజర్ అండ్ ట్రైలర్ తో భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది. దీంతో ఒక స్టార్ హీరో సినిమాకి పడినన్న ప్రీమియర్స్.. హనుమాన్ చిత్రానికి పడ్డాయి. దేశవ్యాప్తంగా 1000 పైగా ప్రీమియర్ షోలు పడ్డాయి. అన్ని ఫిల్ అవ్వడం కూడా గమనార్హం. వీటిలో 280 పైగా షోలు ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఫిల్ అయ్యిపోయాయి. అసలు పెద్దగా మార్కెట్ లేని తేజ సజ్జ సినిమాకి ఈ రేంజ్ ప్రీమియర్స్ పడడం గ్రేట్ అనే చెప్పాలి.

Also read : Hanuman Review : ‘హనుమాన్’ రివ్యూ.. జై హనుమాన్ అనాల్సిందే.. గూస్‌బంప్స్ గ్యారెంటీ..

ఇక అమెరికాలో కూడా ఈ చిత్రానికి ప్రీమియర్ షోలు సూపర్ గానే పడ్డాయి. కేవలం ప్రీమియర్ షోలతోనే హనుమాన్ చిత్రం 250 వేల డాలర్స్‌కు పైగా కలెక్షన్స్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ చూస్తుంటే.. తేజ సజ్జకి అమెరికాలో మొదటి 1M మూవీ దొరికేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రం గురించి సౌత్ ఆడియన్స్ మాట్లాడుతూ.. నార్త్ ఆడియన్స్ ఈ మూవీకి కంప్లీట్ ఫిదా అయ్యిపోతారని చెబుతున్నారు.

దీంతో ఈ చిత్రం 100 కోట్ల మార్క్ అందుకునే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. గతంలో నిఖిల్ ‘కార్తికేయ 2’ కూడా ఇలానే మైథిలాజికల్ కాన్సెప్ట్ తో భారీ విజయం సాధించింది. ఇప్పుడు హనుమాన్ కూడా అలాంటి బ్లాక్ బస్టర్ ని నమోదు చేస్తుందని పేర్కొంటున్నారు. కాగా ఈ మూవీకి సీక్వెల్ ని కూడా ప్రకటించేశారు. అంతేకాదు బాహుబలిలో కట్టప్ప ట్విస్ట్‌లా.. ఈ చిత్రంలో హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటనే ట్విస్ట్ పెట్టారు.