CM KCR Condolence : సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కైకాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల సత్యనారయణ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తని కొనియాడారు.

CM KCR Condolence : సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

CM KCR

Updated On : December 23, 2022 / 3:35 PM IST

CM KCR Condolence : టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కైకాల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల సత్యనారయణ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తని కొనియాడారు. ఆయన మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని అన్నారు.

కైకాల చలనచిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్నమైన పాత్రలను పోషించారని తెలిపారు. వైవిధ్యమైన తన నటన ద్వారా తెలుగు ప్రేక్షకుల ఆధరాభిమానాలను పొందారని పేర్కొన్నారు. శుక్రవారం(డిసెంబర్ 23,2022) కైకాల సత్యనారాయణ కన్నుమూశారు.

Kaikala Satyanarayana : యముడంటే కైకాల సత్యనారాయణే..

గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పూర్తిగా ట్రీట్ మెంట్ బెడ్ కే పరిమితవ్వడంతో ఆయన ఇంటి దగ్గరే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం మరణించారు.