Venu Swamy : చైతన్య – శోభిత విషయంలో.. వేణుస్వామికి షాక్ ఇచ్చిన తెలంగాణ మహిళా కమిషన్..

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వేణుస్వామిపై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసారు.

Venu Swamy : చైతన్య – శోభిత విషయంలో.. వేణుస్వామికి షాక్ ఇచ్చిన తెలంగాణ మహిళా కమిషన్..

Telangana Mahila Commission Notice to Venu Swamy Regarding Nag Chaitanya Sobhita Video

Updated On : August 13, 2024 / 5:29 PM IST

Venu Swamy : సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో పలువురు ప్రముఖుల జాతకాలు చెప్తూ వేణుస్వామి పాపులర్ అయ్యాడు. ఈ విషయంలో పలువురు సెలబ్రిటీల అభిమానుల నుంచి భారీగా విమర్శలు ఎదుర్కున్నాడు. సెలబ్రిటీల జంటలు విడిపోతారని, హీరోలకు ఫ్లాప్స్ వస్తాయని ఇలాంటి కామెంట్స్ చేయడంతో బాగా వైరల్ అవ్వడమే కాకుండా నెగిటివిటిని మూట కట్టుకున్నాడు.

కొన్ని రోజుల క్రితం ఇలా సెలబ్రిటీల జాతకాలు చెప్పనని చెప్పిన వేణుస్వామి తాజాగా నాగచైతన్య – శోభిత జాతకం అంటూ ఓ వీడియో చేసాడు. నాగచైతన్య – శోభిత ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు నిశ్చితార్థం చేసుకున్న తర్వాతి రోజే వేణుస్వామి వీరిద్దరూ విడిపోతారని ఓ వీడియో చేసాడు. ఆ వీడియో వైరల్ గా మారడంతో చైతన్య, శోభిత ఫ్యాన్స్ వేణుస్వామిపై విమర్శలు చేసారు..

Also Read : Amala Paul : భర్త, కొడుకుతో ఫస్ట్ మీట్ యానివర్సరీ చేసుకున్న అమలాపాల్.. ఫోటోలు వైరల్..

ఈ విషయంలో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వేణుస్వామిపై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసారు. సెలెబ్రిటీల గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ, వారి ప్రైవసీకి భంగం కలిసాగిస్తున్నారని, ఇప్పుడు శోభిత విషయంలో కూడా వాళ్ళ నిశ్చితార్థం, వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసారని కంప్లైంట్ చేయడంతో తాజాగా తెలంగాణ మహిళా వేణుస్వామికి నోటీసులిచ్చింది. ఈ నెల 22న కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరి దీనిపై వేణుస్వామి ఎలా స్పందిస్తాడో, విచారణకు వెళ్తాడా చూడాలి.

Telangana Mahila Commission Notice to Venu Swamy Regarding Nag Chaitanya Sobhita Video