Telugu Senior Hero’s: తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సీనియర్ హీరోలు!

పెద్ద హీరోలకే కాదు.. సీనియర్ హీరోలకు కూడా 2022 క్రూషియల్ కాబోతోంది. ఎలా అయినా సరే.. ఈ యంగ్ జనరేషన్ కి పోటీ ఇవ్వగలమని, బాక్సాఫీస్ సత్తా చూపించగలమని ప్రూవ్ చేస్కోవాల్సి ఉంటుంది..

Telugu Senior Hero’s: తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సీనియర్ హీరోలు!

Telugu Senior Hero's

Updated On : January 1, 2022 / 6:07 PM IST

Telugu Senior Hero’s: పెద్ద హీరోలకే కాదు.. సీనియర్ హీరోలకు కూడా 2022 క్రూషియల్ కాబోతోంది. ఎలా అయినా సరే.. ఈ యంగ్ జనరేషన్ కి పోటీ ఇవ్వగలమని, బాక్సాఫీస్ సత్తా చూపించగలమని ప్రూవ్ చేస్కోవాల్సి ఉంటుంది సీనియర్ హీరోలకి. యంగ్ హీరోలకే కాదు.. సీనియర్ హీరోలకు కూడా 2022 చాలా కీలకం. బాలకృష్ణ అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. సీనియర్లకు సవాల్ విసిరారు.

RRR Postpone: వాయిదా పడిన ఆర్ఆర్ఆర్.. మేకర్స్ అధికారిక ప్రకటన!

దాంతో బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల్లోఉన్న నాగార్జున ఇప్పుడు హిట్ కొట్టి తీరాల్సిందే. వైల్డ్ డాగ్ తో పెద్దగా హిట్ కొట్టలేకపోయిన నాగార్జున.. 2022 జనవరిలో సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న బంగార్రాజు మరో పెద్ద మూవీ బ్రహ్మాస్త్రతో పాటు ప్రవీణ్ సత్తారుతో చేస్తున్న సినిమాలతో సత్తా నిరూపించుకోవాల్సి ఉంటుంది.

Telugu Young Hero’s: ఒక్క హిట్ ప్లీజ్.. యంగ్ హీరోలకు క్రూషియల్ ఏడాది!

వెంకటేష్ 2021లో నారప్ప, దృశ్యం సినిమాల్ని రిలీజ్ చేశారు. ధియేటర్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చెయ్యడంతో ఆడియన్స్ తో ఇంటరాక్షన్ మిస్ అయ్యారు సీనియర్ హీరో వెంకి. దాంతో 2022లో ఎలా అయినా డైరెక్ట్ ధియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. 2022లో అనిల్ రావిపూడి హిలేరియస్ ఎంటర్ టైనర్ ఎఫ్ 3ని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలా అయినా ఓ సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు వెంకీ. ఇలా సీనియర్లు, యంగ్ హీరోలు, స్టార్లు అన్న తేడా లేకుండా.. మ్యాగ్జిమమ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరోలందరికీ 2022 క్రూషియల్ కాబోతోంది.