Super Singer Audition : మీలో సింగింగ్ టాలెంట్ ఉందా..? అయితే దానిని ‘సూపర్ సింగర్’తో అందరికి చూపించేయండి..!
తెలుగు బిగ్గెస్ట్ సింగింగ్ రియాలిటీ షో స్టార్ మా 'సూపర్ సింగర్' కొత్త సీజన్ మొదలు కాబోతుంది. మీలో సింగింగ్ టాలెంట్ ఉందా..?

Telugu singing reality show Super Singer new season Audition update
Super Singer Audition : బుల్లితెర రియాలిటీ షోలు ఆడియన్స్ లో ఉన్న టాలెంట్ ని కూడా బయటపెడుతూ వారికి, ఇండస్ట్రీకి ఒక సారధి అవుతున్నాయి. ఈక్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ ఉన్నవారిని అందరికి తెలియజేస్తూ వస్తున్న రియాలిటీ సింగింగ్ షో స్టార్ మా ‘సూపర్ సింగర్’. ఔత్సాహిక గాయకులకు ఒక వేదికగా, సంగీత ప్రేమికులకు ఒక ఎంటర్టైన్మెంట్ గా ఈ షో రన్ అవుతూ వస్తుంది.
Also read : Saindhav : వెంకీ మామ యాక్షన్‌కి టీజర్ రెడీ అయ్యింది.. ఎటాక్‌కి టైం ఫిక్స్..
ఈ షో కొత్త సీజన్ కోసం ఆడియన్స్ అండ్ సింగర్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సీజన్ ని మరెక్కడా లేని విధంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు నిర్వాహుకులు. మరి మీరుకూడా మీ సంగీత ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంకండి. వేదిక సిద్ధమైంది, స్పాట్ లైట్ నిరీక్షిస్తుంది. ఇక గాత్ర ప్రతిభావంతులు తమ అసాధారణ గాన ప్రతిభను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది.
Also read : Nani : నేను నిన్ను నమ్ముతున్నాను.. నువ్వు నన్ను నమ్ము.. ఎవరి కోసం నాని ఈ మాటలు..!
అక్టోబర్ 15, 2023న హైదరాబాద్‌లో అమీర్‌పేటలో ఉన్న సారథి స్టూడియోస్‌లో ఉదయం 9:00 గంటలకు.. సూపర్ సింగర్ కొత్త సీజన్ ఆడిషన్స్ ప్రారంభమవుతున్నాయి. మీరు 18-30 సంవత్సరాల వయస్సు గలవారైతే, మీ స్వర ప్రతిభతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవాలని కలలుకంటున్నట్లయితే.. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. 9381340098 @ కళ్యాణ్ చక్రవర్తి.