Ye Chota Nuvvunna : ఉద్యోగం లేని అబ్బాయి ప్రేమకథ.. ”ఏ చోట నువ్వున్నా” మూవీ ట్రైలర్ చూశారా..
ప్రేమించడానికి ఉద్యోగం అవసరం లేదు. కానీ పెళ్లి చేసుకోవడానికి ఉద్యోగం తప్పనిసరి. ఈ పాయింట్ ని ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి తన లైఫ్ లో ఎదుర్కోవడం తప్పనిసరి. ఇలాంటి ఒక అబ్బాయి ప్రేమకథని..

Telugu Youthful love story Ye Chota Nuvvunna movie trailer released
Ye Chota Nuvvunna : ప్రేమించడానికి ఉద్యోగం అవసరం లేదు. కానీ పెళ్లి చేసుకోవడానికి ఉద్యోగం తప్పనిసరి. ఈ పాయింట్ ని ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి తన లైఫ్ లో ఎదుర్కోవడం తప్పనిసరి. ఇలాంటి ఒక అబ్బాయి ప్రేమకథని నేపథ్యంగా తీసుకోని వాస్తవానికి దగ్గరగా తీసిన కొత్త సినిమా “ఏ చోట నువ్వున్నా”. తాజాగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా జరిగింది.
ఈ ఈవెంట్ కి ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ దామోదర్ ప్రసాద్, ప్రముఖ దర్శకులు వి.ఎన్ ఆదిత్య, ఎ. ఎస్ రవికుమార్ చౌదరి, నర్రా శివనాగు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, యువ నిర్మాత అహితేజ బెల్లంకొండ, ప్రముఖ నటులు-నిర్మాత రాంకీ, ప్రముఖ రచయిత మరుదూరి రాజా, ఈవెంట్ స్పాన్సర్ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త ఎల్.ఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శివ రెమిడాల హాజరయ్యి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.
ఎస్ వి.పసలపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రశాంత్ గురవన, అంబికా ముల్తానీ, మధు బాబు, సతీష్ సరిపల్లి, ముకేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎమ్ ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శాఖమూరి శ్రీనివాసరావు సమర్పణలో మందలపు శ్రీనివాసరావు, మేడికొండ శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని కూడా మూవీ టీం రిలీజ్ చేశారు. ట్రైలర్ యూత్ ని ఆకట్టుకునేలా ఉంది.
Also read : Che Movie Trailer : చేగువేరా బయోపిక్ “చే” మూవీ ట్రైలర్ చూశారా.. పవన్ కళ్యాణ్ ద్వారా తెలిసిన ఈ కథ..
తరుణ్ రాణా ప్రతాప్ ఈ సినిమాకి సంగీతం అందించారు. రచయిత కుమార్ పిచ్చుక ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా మాటలు రాశారని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని నెల 17న విడుదల చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తెలియజేశారు. ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకుల మన్నలను పొందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మేకర్స్.