Vijay : విజయ్ సరసన సూర్య భార్య జ్యోతిక.. OG భామ కూడా.. డ్యూయల్ రోల్‌లో విజయ్ నెక్స్ట్ సినిమా..

లియో తర్వాత విజయ్ 68వ సినిమాని వెంకట్ ప్రభు దర్శకత్వంలో ప్రకటించారు. లియో సినిమా రిలీజ్ తర్వాత ఈ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

Vijay : విజయ్ సరసన సూర్య భార్య జ్యోతిక.. OG భామ కూడా.. డ్యూయల్ రోల్‌లో విజయ్ నెక్స్ట్ సినిమా..

Thalapathi Vijay 68 Movie Update Jyotika and Priyanka Mohan plays female leads vijay in Dual role

Updated On : August 22, 2023 / 10:37 AM IST

Vijay Next Movie : తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో లియో(Leo) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చివరిదశ చిత్రీకరణ దశలో ఉంది లియో సినిమా. దసరా కానుకగా అక్టోబర్ 19 రిలీజ్ చేస్తామని ప్రకటించారు. లియో తర్వాత విజయ్ 68వ సినిమాని వెంకట్ ప్రభు దర్శకత్వంలో ప్రకటించారు. లియో సినిమా రిలీజ్ తర్వాత ఈ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ సరసన సూర్య భార్య, నటి జ్యోతిక నటిస్తుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా మరోసారి తమిళ మీడియాలో ఈ వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలో జ్యోతికతో పాటు ప్రియాంక మోహన్ కూడా ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం ప్రియాంక పవన్ కళ్యాణ్ సరసన OG సినిమాలో నటిస్తుంది.

Mega 156 : చిరంజీవి నెక్స్ట్ సినిమా కూతురి నిర్మాణంలోనే.. బర్త్ డే విషెష్ చెప్తూ మెగా 156 అనౌన్స్..

ఇక ఈ సినిమాలో విజయ్ మరోసారి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని, ఇదొక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని డైరెక్టర్ వెంకట్ ప్రభు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. గతంలో విజయ్ చేసిన డ్యూయల్ రోల్, పొలిటికల్ కథలు మంచి విజయాలు సాధించాయి. దీంతో ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.