Pavithra Gowda : నా కూతురు అతనికి పుట్టలేదు.. మా రిలేషన్ గురించి అతని భార్యకు తెలుసు.. సోషల్ మీడియాలో నటి పోస్టు
ఆ స్టార్ హీరోతో ఆ హీరోయిన్ పదేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. సడెన్‌గా ఆ హీరో భార్య ఆ హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చిందట. దీంతో ఆ నటి సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇది ఏ ఇండస్ట్రీ కథంటే? చదవండి.

Pavithra Gowda
Pavithra Gowda : కన్నడ స్టార్ హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడల మధ్య కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగుతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా దర్శన్ భార్య పవిత్రకు షూటింగ్ సెట్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తోంది. దీనిపై పవిత్ర గౌడ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ పోస్టు ఆసక్తికరంగా మారింది.
Kamakshi Bhaskarla : కెరియర్ లేకుండా చేస్తామన్నారు.. మిస్ ఇండియా పోటీలపై నటి సంచలన వ్యాఖ్యలు
దర్శన్, పవిత్ర రిలేషన్‌లో ఉన్నారని చానాళ్లుగా టాక్. ఇటీవల పవిత్ర వీరిద్దరూ కాస్త సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ‘పది సంవత్సరాల అనుబంధం.. థ్యాంక్యూ’ అనే టాగ్ లైన్ కూడా జోడించారు. ఇక ఈ వీడియో చూసిన దర్శన్ భార్య విజయలక్ష్మి దర్శన్‌కి ఒళ్లు మండిపోయిందట. ఇంకేముందు పవిత్ర ఎక్కడైతే షూటింగ్‌లో ఉందో అక్కడికి వెళ్లిమరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. అవసరమైతే కేసులు పెడతానంటూ బెదిరించిందట. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో పవిత్ర గౌడ ఒక పోస్టు పెట్టారు.
Raviteja : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘రవితేజ’తో సినిమా.. ‘హనుమాన్’లో కోతి పాత్రతో..
పవిత్ర గౌడకు గతంలో సంజయ్ అనే వ్యక్తితో పెళ్లైందట. వారిద్దరి సంతానమే ఖుషీ అనే కూతురు ఉంది. సంజయ్‌కి విడాకులు ఇచ్చారట పవిత్ర. ఆ తర్వాత దర్శన్‌తో ప్రేమలో ఉన్నానని తమ మధ్య ప్రేమ, కేరింగ్ మాత్రమే ఉన్నాయని పవిత్ర తన పోస్టులో రాసుకొచ్చారు. దర్శన్ భార్య విజయలక్ష్మికి ఇదంతా తెలుసని.. దర్శన్, తను కలిసి ఉన్నా అభ్యంతరం చెప్పలేదని పవిత్ర తన పోస్టులో స్పష్టం చేశారు. తన మొదటి పెళ్లి విడాకుల పత్రాలతో పాటు సరైన ఆధారాలన్ని చూపిస్తానని పవిత్ర చెప్పారు. అన్ని విషయాలు తెలిసి మరీ విజయలక్ష్మి తనను ఇబ్బందులకు గురి చేస్తే కోర్టుకు వెళ్లడానికి కూడా వెనుకాడనని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చేసారు. దీనిపై దర్శన్ స్పందన ఎలా ఉండబోతోంది? వీరి ప్రేమ్ కహానీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని కన్నడ ఇండస్ట్రీ తెగ చర్చించుకుంటోంది.
View this post on Instagram
View this post on Instagram