PSPK 28 కాన్సెప్ట్ పోస్టర్‌లో ఇవి గమనించారా!..

  • Published By: sekhar ,Published On : September 2, 2020 / 05:13 PM IST
PSPK 28 కాన్సెప్ట్ పోస్టర్‌లో ఇవి గమనించారా!..

Updated On : September 2, 2020 / 5:51 PM IST

PSPK 28 Concept Poster: రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిన పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ షూటింగ్‌ను దాదాపు పూర్తి చేసిన పవన్.. క్రిష్ దర్శకత్వంలో చేయనున్న సినిమాను త్వరలో పట్టాలెక్కించబోతున్నారు.



దీని తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్‌తో కలిసి పనిచేయబోతున్నారు. పవర్ స్టార్ 28వ సినిమా ఇది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. పవన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ రిలీజ్ చేశారు.
https://10tv.in/ntr-30th-movie-update-soon/
“The Blockbuster combo is Back.. This Time, it’s not just Entertainment” రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్‌ల ఫోటోలతోపాటు లగ్జరీ బైక్‌పై పెద్ద బాలశిక్ష, గులాబి పువ్వు చూపించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు.



పవన్, హరీష్ శంకర్, డిఎస్పీ కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సెన్సేషనల్ హిట్ అయింది. ఈసారి మా కలయికలో అదిరిపోయే సినిమా రాబోతోంది అని హరీష్, దేవి కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.