The Family Man 2 : తెలుగులో స్ట్రీమింగ్..
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ఆడియన్స్‌ను మరింత ఎంటర్‌టైన్ చెయ్యడానికి రెడీ అవుతోంది.. అదేంటి.. సీజన్ 2 ఈ మధ్యనే కదా రిలీజ్ అయ్యింది. మళ్లీ రెడీ అవడమేంటి అనుకుంటున్నారా..?

The Family Men 2
The Family Man 2: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ఆడియన్స్‌ను మరింత ఎంటర్‌టైన్ చెయ్యడానికి రెడీ అవుతోంది. అదేంటి.. సీజన్ 2 ఈ మధ్యనే కదా రిలీజ్ అయ్యింది. మళ్లీ రెడీ అవడమేంటి అనుకుంటున్నారా..? ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ త్వరలో తెలుగులో అందుబాటులోకి రానుంది. అదీ సంగతి..
ఫస్ట్ సీజన్ మీద ఏర్పడ్డ క్యూరియాసిటీ, రెండో సీజన్‌తో స్టార్ యాక్ట్రెస్ సమంత అక్కినేని డిజిటల్ డెబ్యూ, పైగా శ్రీలంక టెర్రరిస్ట్‌గా నెగెటివ్ రోల్.. ప్రోమోలతోనే కాంట్రవర్శీలు, సెకండ్ సిరీస్‌ను రిలీజ్ కాకుండా బ్యాన్ చెయ్యాలంటూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు. కట్ చేస్తే, పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవడంతోటే అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది సెకండ్ సిరీస్.
The Family Men 2 : ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసా..!
ముఖ్యంగా సమంత పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. సరికొత్త కథ, కథనాలతో ఉత్కంఠంగా రూపొందించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ను ముందుగా తెలుగులోనూ రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ పాండమిక్ పరిస్థితుల వల్ల వీలు పడలేదు. ఇప్పుడు ప్రేక్షకుల కోసం ఈ సీజన్‌ను తెలుగులో విడుదల చెయ్యాలని ఫిక్స్ అయిన మేకర్స్ అందుకుతగ్గ ఏర్పాట్లు చేశారని, కొద్ది రోజుల్లో తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుందని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.