Razakar Movie : రజాకార్ సినిమా ప్రదర్శన ఆపాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

Razakar Movie : సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను సవాలు చేయనందున ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం.. ప్రత్యామ్నయం ఉందంటూ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ముగించింది.

Razakar Movie : రజాకార్ సినిమా ప్రదర్శన ఆపాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

The High Court dismissed the petition filed to stop the release of the movie Razakar

Updated On : March 13, 2024 / 11:27 PM IST

Razakar Movie : రజాకార్ సినిమా ప్రదర్శన విడుదల కాకుండా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్) ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మూవీ విడుదలను నిలిపేయాలని పిటీషనర్ ధర్మాసనాన్ని కోరారు.

Read Also : Razakar Movie : ‘రజాకార్’ టీజ‌ర్‌ లాంచ్ ఈవెంట్‌ గ్యాలరీ..

సినిమా ప్రదర్శనకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసిందని నిర్మాత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రజాకార్ సినిమాపై అభ్యంతరం ఉంటే నిపుణుల కమిటీకి, కేంద్రానికి ఫిర్యాదు చేయాలని పిటీషనర్‌కు సూచించింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను సవాలు చేయనందున ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం.. ప్రత్యామ్నయం ఉందంటూ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ముగించింది.

తెలంగాణ గడ్డపై పోరాడిన వారి చరిత్ర ఆధారంగా ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ మూవీని తెరకెక్కించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, ప్రేమ, అనుష్య త్రిపాఠి, ఇంద్రజ, అనసూయ, మకరంద్ దేశ్ పాండే తదితరులు నటించారు.

ఈ నెల 15న పలు భాషల్లో విడుదల :
ఈ మూవీని గూడురు నారాయణరెడ్డి నిర్మించగా.. ఈ నెల 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే రజాకార్ మూవీ విడుదలను నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్) పిటిషన్ విచారించిన అనంతరం హైకోర్టు కొట్టివేసింది.

Read Also : Razakar : రజాకార్ సినిమాపై కేంద్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు.. ఎన్నికల కోసమే ఈ సినిమా అంటూ సిపిఐ నేతల మండిపాటు..