Blue Star : పెళ్లి తర్వాత జంటగా వెండితెరపై కనిపించనున్న ఆ స్టార్ కపుల్..

ఇటీవలే పెళ్లి చేసుకున్న కోలీవుడ్ స్టార్ కపుల్ సినిమా జనవరి 25న థియేటర్లలోకి వస్తోంది. పెళ్లైన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఈ జంటకు ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి.

Blue Star : పెళ్లి తర్వాత జంటగా వెండితెరపై కనిపించనున్న ఆ స్టార్ కపుల్..

Blue Star

Updated On : January 23, 2024 / 6:00 PM IST

Blue Star : ఈ మధ్యే పెళ్లి చేసుకున్న అశోక్ సెల్వన్-కీర్తి పాండియన్ జంట తమిళ సినిమా ‘బ్లూ స్టార్’ థియేటర్లలోకి వస్తున్నారు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో భార్యాభర్తలైన ఈ జంట సినిమా థియేటర్లలోకి రావడం సమ్ థింగ్ స్పెషల్ అని చెప్పాలి.

Saif Ali Khan : హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీఖాన్.. ఎన్టీఆర్ అభిమానులు హ్యాపీ ట్వీట్స్..

సీనియర్ నటుడు అరుణ్ పాండియన్ కూతురు నటి కీర్తి పాండియన్, నటుడు అశోక్ సెల్వన్ గతేడాది సెప్టెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు. తిరునల్వేలిలో వీరి వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. పదేళ్లుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే 2013 లో కలిసిన ఇద్దరూ నంబర్లు మార్చుకున్నారని.. ఆ తర్వాత టచ్‌లో లేరని మళ్లీ బ్లూ స్టార్ సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్నాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని ఇటీవల ఈ జంట వెల్లడించింది. కాగా వీరిద్దరూ నటించిన ‘బ్లూ స్టార్’ జనవరి 25న థియేటర్లలోకి వస్తోంది. పెళ్లైన తర్వాత ఈ జంట వెండి తెరపై కూడా భార్యాభర్తలుగా కనిపించడం ప్రత్యేకం అని చెప్పాలి.

Sai Pallavi : చెల్లెలు నిశ్చితార్థంలో సాయి పల్లవి డాన్స్.. వీడియో చూశారా..!

క్రికెట్ నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి. అయితే 1990లో తమిళనాడులోని కుంభకోణం అనే ఊర్లో జరిగిన యదార్థ సంఘటనలతో ‘బ్లూ స్టార్’ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్, పృథ్వి పాండియరాజన్, దివ్య దురైస్వామి కీలక పాత్రల్లో నటించారు. గోవింద వసంత సంగీతం అందించిన ఈ సినిమాని ఎస్.రాజ్ కుమార్ డైరెక్ట్ చేసారు.