Theater & OTT Releases: ఈ వారం ‘థియేటర్‌’తో పాటు ‘ఓటీటీ’లో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలివే..

ఈ వారం సినిమా ప్రియులకు పండుగనే చెప్పాలి. దాదాపు 20కు పైగా సినిమాలు OTT మరియు థియేటర్ లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఆ వరసలో ముందుగా తమిళ్ హీరో ఆర్య యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా "కెప్టెన్‌" కొత్త కథాంశంతో ఈ నెల 8న విడుదల కానుంది. మరసటి రోజూ....

Theater & OTT Releases: ఈ వారం ‘థియేటర్‌’తో పాటు ‘ఓటీటీ’లో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలివే..

Theater and OTT Releases in September

Updated On : September 6, 2022 / 7:54 PM IST

Theater & OTT Releases: ఈ వారం సినిమా ప్రియులకు పండుగనే చెప్పాలి. దాదాపు 20కు పైగా సినిమాలు OTT మరియు థియేటర్ లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఆ వరసలో ముందుగా తమిళ్ హీరో ఆర్య యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా “కెప్టెన్‌” కొత్త కథాంశంతో ఈ నెల 8న విడుదల కానుంది. మరసటి రోజూ హిందీ భారీ బడ్జెట్ సినిమా “బ్రహ్మాస్త్ర”తో పాటు టాలీవుడ్ నటుడు శర్వానంద్ నటించిన “ఒకే ఒక జీవితం”, మరో రెండు చిన్న సినిమాలైనా శ్రీరంగాపురం, కొత్తకొత్తగా విడుదలకు సిద్ధమయ్యాయి.

Okeoka Jeevitham Trailer Launch Event : ఒకేఒక జీవితం ట్రైలర్ లాంచ్ గ్యాలరీ

థియేటర్ రిలీజ్ లు ఇలా ఉండగా ప్రముఖ ఓటీటీ సంస్థల నుంచి కూడా ఈ వారం అనేక సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఆ క్రమంలో డిస్నీప్లస్ హాట్‌స్టార్‌ నుండి థోర్‌ లవ్‌ అండ్‌ థండ్‌, గ్రోయింగ్‌ అప్‌, హైడోస్‌, పినాచో, కార్స్‌ ఆన్‌ ది రోడ్‌, వెడ్డింగ్‌ సీజన్‌ వంటి మూవీస్, వెబ్ సిరీస్ విడుదలవుతుంటే. ఆహా నుంచి డ్యాన్స్‌ ఐకాన్‌(రియాల్టీ షో), జీ5 నుండి పాపన్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌ నుంచి యునికి యారీ వస్తున్నాయి.

ఇక ఇంటర్నేషనల్ OTT ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌ వేదికిగా.. వన్స్‌ అపాన్‌ ఏ స్మాల్‌ టౌన్‌, రిక్‌ అండ్‌ మార్టీ:సీజన్‌-6: ఎపిసోడ్‌-1, అన్‌టోల్డ్‌: ది రేస్‌ ఆఫ్‌ సెంచరీ, ఇండియన్‌ ప్రేడేటర్‌: ది డైరీ ఆఫ్‌ ఏ సీరియల్‌ కిల్లర్‌, చెప్స్‌ టేబుల్‌: పిజ్జా ఏ క్వైట్‌ ప్లేస్‌, ది అంత్రాక్స్‌ అటాక్స్‌, ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌, కోబ్రా కాయ్‌: సీజన్‌-5,మోర్టల్‌ కాంబ్యాట్‌. అలానే అమెజాన్ ప్రైమ్.. స్టూడియో 666, హీ ఈజ్‌ సైకోమెట్రిక్, రిప్లై 1994, ప్రిజన్‌ ప్లే బుక్‌, ఎలీన్‌ వంటి డాక్యమెంటరీ, వెబ్‌ సిరీస్‌, టాక్‌ షోలు, మూవీలు ఈ వారంలో స్ట్రీమింగ్‌ కానున్నాయి.