RRR For Oscars: ఆ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ది సాహసమే అని చెప్పాలి!

ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం భారతదేశ సినిమా ప్రేక్షకుల చూపులు ఈ సినిమాపైనే ఉన్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఆస్కార్ అవార్డులకు నామినేట్ కావడంతో ఆర్ఆర్ఆర్ అభిమానులతో పాటు యావత్ ప్రేక్షకులు కాలర్ ఎగరేస్తున్నారు. ఒక్క విషయంలో మాత్రం ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

RRR For Oscars: ఆ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ది సాహసమే అని చెప్పాలి!

This Aspect Becoming Comedy In RRR For Oscars

Updated On : October 8, 2022 / 2:21 PM IST

RRR For Oscars: ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం భారతదేశ సినిమా ప్రేక్షకుల చూపులు ఈ సినిమాపైనే ఉన్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఆస్కార్ అవార్డులకు నామినేట్ కావడంతో ఆర్ఆర్ఆర్ అభిమానులతో పాటు యావత్ ప్రేక్షకులు కాలర్ ఎగరేస్తున్నారు. అయితే భారత్ తరఫున కాకుండా ఇది జనరల్ కేటగిరీలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డుల కోసం ఏకంగా ఓ డజను విభాగాల్లో ఈ సినిమా నామినేట్ అయ్యింది.

RRR For Oscars: సెప్టెంబర్ 30న ‘ఆర్ఆర్ఆర్’కు అగ్నిపరీక్ష..?

బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ.. ఇలా పలు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సీత పాత్రలో నటించగా, ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. అయితే, ఇప్పుడు సీత పాత్రలో నటించినందుకు బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ విభాగంలో ఆస్కార్ బరిలో ఆలియా భట్ పేరును నామినేట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

RRR: ఆస్కార్ బరిలో “RRR”.. అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్!

ఆలియా భట్ పాత్ర కీలకమే అయినా, నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్ర అని.. ఆమెకంటే, శ్రియా పాత్రకే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందని.. కనీసం ఆమెను నామినేట్ చేసినా బాగుండేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఆలియా భట్ నామినేషన్ వృథాగా పోతుందని పలువురు అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ది పెద్ద సాహసమే అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.