Bigg Boss 5 Telugu: ఈ సీజన్ వంద రోజులు కాదు.. 180 రోజులా?
బిగ్ బాస్.. బిగ్ బాస్.. యావత్ ప్రపంచంలోనే సక్సెస్ ఫార్ములాగా పేరున్న ఈ రియాలిటీ షో సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో కూడా ఏ భాషలో అయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే బిగ్ బాస్ టాపిక్.. ఇప్పుడు మరింత రచ్చగా మారింది. తెలుగులో నాలుగో సీజన్ ముగిసి ఇన్ని రోజులు అవుతున్నా కూడా కంటెస్టెంట్ల హడావిడి తగ్గడం లేదు. కరోనాతో వచ్చిన గ్యాప్ వల్ల కాస్త ఆలస్యంగా మొదలుకాబోతోన్న ఈ ఐదో సీజన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్.. బిగ్ బాస్.. యావత్ ప్రపంచంలోనే సక్సెస్ ఫార్ములాగా పేరున్న ఈ రియాలిటీ షో సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో కూడా ఏ భాషలో అయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే బిగ్ బాస్ టాపిక్.. ఇప్పుడు మరింత రచ్చగా మారింది. తెలుగులో నాలుగో సీజన్ ముగిసి ఇన్ని రోజులు అవుతున్నా కూడా కంటెస్టెంట్ల హడావిడి తగ్గడం లేదు. కరోనాతో వచ్చిన గ్యాప్ వల్ల కాస్త ఆలస్యంగా మొదలుకాబోతోన్న ఈ ఐదో సీజన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ఈ మధ్యనే ఐదో సీజన్ లోగోను స్టార్ మా వదలడంతో అప్పటి నుంచి లీకువీరులు రెచ్చిపోతోన్నారు. కంటెస్టెంట్ల లిస్ట్‌లో కొత్త కొత్త పేర్లను చేర్చుతూ లీకులు వదులుతున్నారు. ఈ లిస్ట్ కాస్త వైరల్ అవుతుండడంతో బిగ్ బాస్ అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వస్తున్న సమాచారం మేరకు బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ సెప్టెంబర్ రెండవ వారంలో మొదలు కానుందని తెలుస్తోంది. ఈ తాజా సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేయబోతున్నారని.. ఇప్పటికే ప్రోమో షూటింగ్ కూడా పూర్తయిందని వార్తలొస్తున్నాయి.
ఇక అది అలా ఉంటే ఇప్పటికే పలు సెలెబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. అందులో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, ఇషా చావ్లా, సురేఖా వాణి, యాంకర్ వర్షిణి, నవ్యస్వామి పేర్లు ముఖ్యంగా వినిపిస్తుండగా అందరిలో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్లు వినిపించింది. కాగా.. ఇప్పుడు వినిపిస్తున్న కథనం మరింత ఆసక్తిగా మారింది. ఈ ఐదవ సీజన్ వంద రోజుల నుండి 180 రోజులకు పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతుంది.
మన దేశంలో హిందీలో ఈ షో 14 సీజన్లు పూర్తిచేసుకొని 15వ సీజన్ కు సిద్దమవుతుంది. అయితే.. ఈ సీజన్ ను అక్కడ 180 రోజుల పాటు ప్రసారం చేయనున్నారు. ఇప్పటి వరకు తెలుగులో నాలుగు సీజన్లను 104 రోజులలో ముగించారు. అయితే.. ఈ ఐదవ సీజన్ ను గత నాలుగు సీజన్ల కంటే మరికొంత సమయం పొడిగించేలా షో నిర్వాహకులు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే నిజమైతే అభిమానులకు మరికాస్త వినోదం గ్యారంటీ.