రామ్ ‘రెడ్’ టీజర్ రెడీ..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ద్విపాత్రాభినయం చేస్తున్న ‘రెడ్’ టీజర్ అప్‌డేట్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ద్విపాత్రాభినయం చేస్తున్న ‘రెడ్’ టీజర్ అప్‌డేట్..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న థ్రిల్లర్.. ‘రెడ్’. కిశోర్‌తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మి స్తున్న‘రెడ్’ చిత్రం కోసం రెండు పాటలను ఇటీవల ఇటలీలో చిత్రీకరించారు. ఆ రెండు పాటల్లో ఒకదాన్ని 10 వేల అడుగుల ఎత్తులో డోలమైట్స్‌లో షూట్ చేయడం విశేషం.
రామ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా నివేదా పేతురాజ్, మాళవిక శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ అప్‌డేట్ వచ్చింది. తమిళ్ ‘తడమ్’ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘రెడ్’ మూవీ టీజర్ ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వేసవి కానుకగా ఏప్రిల్ 9న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం : సమీర్‌రెడ్డి, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్ : పీటర్‌హెయిన్స్, ఎడిటింగ్: జునైద్, సమర్పణ : కృష్ణ పోతినేని, నిర్మాత : ‘స్రవంతి’ రవికిశోర్, దర్శకత్వం : కిశోర్‌తిరుమల.