Nupur Sanon : నుపుర్ సనన్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. కృతి సనన్ సిస్టర్ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఎంట్రీ..

టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నుపుర్ సనన్ తాజాగా తెలుగు మీడియాతో ముచ్చటించింది.

Nupur Sanon : నుపుర్ సనన్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. కృతి సనన్ సిస్టర్ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఎంట్రీ..

Tiger Nageswara Rao Heroine Nupur Sanon Exclusive Interview

Updated On : October 12, 2023 / 1:43 PM IST

Nupur Sanon : మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ కాంబినేషన్లో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నుపుర్ సనన్ తాజాగా తెలుగు మీడియాతో ముచ్చటించింది.

‘టైగర్ నాగేశ్వరరావు’లో మీ పాత్ర గురించి చెప్పండి ?

‘టైగర్ నాగేశ్వరరావు’ లో నా పాత్ర పేరు సార. తను మార్వాడీ అమ్మాయి. తనది సోల్ ఫుల్ క్యారెక్టర్. తను ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం ఏదైనా చేసే అమ్మాయి. ఇది నా మొదటి సినిమా. నా పాత్ర కమర్షియల్ గా ఉంటూనే పర్ఫార్మెన్స్ కూడా స్కోప్ ఉన్న రోల్ ఇది. మొదటి సినిమాకే ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర దొరకడం ఆనందంగా వుంది.

ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.. ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?

మొదటిది.. మాస్ మహారాజా రవితేజ గారు. ఆయన సినిమాలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. రెండోది.. అభిషేక్ అగర్వాల్ ప్రొడక్షన్. ఇప్పటికే కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2 లాంటి పాన్ ఇండియా విజయాలు ఇచ్చారు. ఇది నాకు మంచి లాంచింగ్ ప్రాజెక్ట్ అవుతుందని భావించాను. అలాగే దర్శకుడు వంశీ గారు. ఈ పాత్ర కోసం దాదాపు 200 మందిని ఆడిషన్స్ చేశారని తెలిసింది. ఈ పాత్రకు నేను యాప్ట్ గా వుంటానని ఆయన బిలీవ్ చేయడం నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది.

ఇది పీరియడ్ సినిమా కదా.. ఈ పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు ?

దర్శకుడు వంశీ గారు ఈ కథపై దాదాపు మూడేళ్ళు రీసెర్చ్ చేశారు. ఏ పాత్ర ఎలా ఉండాలో ఆయనకి చాలా క్లారిటీ వుంది. హీరోయిన్ హెయిర్ బ్యాండ్ ఎలా ఉండాలో కూడా క్లియర్ గా రాసుకున్నారు. ఆయన చెప్పినట్లుగా నటించాను.

రవితేజ గారి సినిమాలు చూశారా ? ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

దాదాపు అన్నీ సినిమాలు చూశాను. రవితేజ గారు ఒరిజినల్ విక్రమ్ రాథోడ్. రవితేజ యాక్టింగ్ అమేజింగ్. ఆయన కామిక్ టైమింగ్ అద్భుతంగా వుంటుంది. మాస్ మహారాజా టైటిల్ రవితేజ గారికి యాప్ట్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన హిందీ చాలా అద్భుతంగా వుంటుంది. షూటింగ్ లో చాలా సపోర్ట్ చేశారు. ఆయన వలన లాగ్వెంజ్ బారియర్ తొలిగిపోయింది.

కృతిసనన్ నుంచి ఎలాంటి సలహాలు తీసుకున్నారు ?

తన జర్నీ కూడా తెలుగు నుంచి ప్రారంభమైయింది. మా ఇద్దరి అభిరుచులు వేరుగా ఉంటాయి. తను నాకు ఇచ్చిన ఒకే ఒక సలహా.. నువ్వు నీలా వుండు అని చెప్పింది. నేను కూడా అదే ఫాలో అవుతాను.

Tiger Nageswara Rao Heroine Nupur Sanon Exclusive Interview

సౌత్ సినీ పరిశ్రమ ఎలా అనిపించింది ?

సౌత్ ఇండస్ట్రీ చాలా ఆర్గనైజ్ గా వుంటుందని విన్నాను. ఈ సినిమాతో ప్రత్యక్షంగా చూశాను. చాలా గౌరవంగా మర్యాదగా చూసుకున్నారు. చాలా సపోర్ట్ చేశారు. అలాగే టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ వుంటారు ఇక్కడ. మధి గారు, జీవి ప్రకాష్ గారు బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు.

మీకు ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు ?

సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఫిదా చూసి ఫిదా అయిపోయాను. అలాగే అనుష్క శెట్టి, కీర్తి సురేష్ అంటే కూడా ఇష్టం.

టాలీవుడ్ లో ఇష్టమైన హీరోలు ?

నాని గారు అంటే ఇష్టం. అలాగే రామ్ పోతినేని, విశ్వక్ సేన్ కూడా ఇష్టం.

భవిష్యత్ లో ఎలాంటి పాత్రలు చేయాలని వుంది ?

అన్ని రకాల పాత్రలు చేయాలని వుంది. అలాగే ఒక బలమైన ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా చేయాలని వుంది. ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్ధికితో బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నాను.