Rashmika Mandanna : ‘పుష్ప’ సెట్ నుంచి ఈ సెట్‌కి వస్తే రిలాక్స్ అయ్యేదాన్ని
రష్మిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''శర్వానంద్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు ఒకే టైంలో షూట్ జరిగాయి. నేను పుష్ప సెట్ నుంచి...........

Rashmika
Rashmika Mandanna : శర్వానంద్, రష్మిక మందన్న కలిసి జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా మార్చ్ 4న రిలీజ్ కి రెడీగా ఉంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మించగా, ఫుల్ లెంగ్త్ కామెడీ, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కిషోర్ తిరుమల తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో రాధిక, ఖుష్భు, ఊర్వశి లాంటి సీనియర్ నటులతో పాటు చాలా మంది లేడీ ఆర్టిస్టులు నటించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. రష్మిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”శర్వానంద్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు ఒకే టైంలో షూట్ జరిగాయి. నేను పుష్ప సెట్ నుంచి ఆడవాళ్లు మీకు జోహార్లు సెట్ కి వస్తే చాలా రిలాక్స్ అయ్యేదాన్ని. అక్కడ అడవుల్లో షూటింగ్ చేసి ఇక్కడికొస్తే ఒక పిక్నిక్ లా అనిపించేది.”
Kajal Agarwal : గర్భధారణ సమయంలో ఏరోబిక్స్ చేయాలి.. తన ఏరోబిక్స్ వీడియోని పోస్ట్ చేసిన కాజల్
”అప్పుడప్పుడు శర్వానంద్ ఇంటి నుంచి ఫుడ్ తెచ్చి పెట్టేవాడు. ఆ ఫుడ్ చాలా బాగుంటుంది. ఈ సినిమా షూట్ అయినంతకాలం ఒక ఫ్యామిలీలా కలిసి ట్రావెల్ చేశాం. శర్వాను మిగతా ఆడవాళ్లు ఈ సినిమాలో ఇబ్బంది పెడుతుంటారు. నేనూ వాళ్లతో కలిసిపోయాను. అంతమంది మహిళల మధ్య ఆయన ఎలా ఉన్నారు, ఏం చేశారు అనేది సినిమాలో చూడాలి. సెట్ లో కూడా చాలా మంది ఆడవాళ్ళ మధ్య శర్వా ఒక్కడినే చేసి ఆడుకునేవాళ్ళం. షూట్ టైంలో గ్యాప్ వస్తే చాలా ఫన్ గా ఉంటుంది సెట్ మొత్తం.”
Adipurush : వచ్చే సంక్రాంతికి ‘ఆదిపురుష్’.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభాస్
”ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ నటీమణులతో కలిసి పనిచేయడం ఒక మర్చిపోలేని అనుభవం. సెట్ లో ఉన్నంతసేపు నవ్వుతూ మాట్లాడతారు. ఒక్కసారి యాక్షన్ చెప్పగానే షాట్ కి రెడీ అయిపోతారు. ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు. సెట్ లో ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలని వాళ్లను చూసి నేర్చుకున్నాను” అంటూ సినిమా గురించి, శర్వా గురించి తెలిపింది రష్మిక.