‘‘కల్మషం లేని మనసు.. ఆయనకు ఇవ్వడమే తెలుసు’’..

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌లో కోవిడ్ సందర్భంగా తీసుకొంటున్న పలు చర్యలను శ్రీ నందమూరి బాలకృష్ణ నేడు పరిశీలించారు..

  • Published By: sekhar ,Published On : May 1, 2020 / 12:37 PM IST
‘‘కల్మషం లేని మనసు.. ఆయనకు ఇవ్వడమే తెలుసు’’..

Updated On : May 1, 2020 / 12:37 PM IST

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌లో కోవిడ్ సందర్భంగా తీసుకొంటున్న పలు చర్యలను శ్రీ నందమూరి బాలకృష్ణ నేడు పరిశీలించారు..

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌‌లో కోవిడ్-19 సందర్భంగా తీసుకుంటున్న పలు చర్యలను శ్రీ నందమూరి బాలకృష్ణ నేడు పరిశీలించారు. ముఖ్యంగా హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లను భవనంలోనికి ప్రవేశించడానికి ముందుగా స్క్రీనింగ్ కోసం ఏర్పాటు చేసిన బృందాలను అడిగి వివరాలు తెలుసుకొన్నారు. అనంతరం హాస్పిటల్‌లోనికి ప్రవేశించే వారికోసం ఏర్పాటు చేసిన శానిటైజేషన్ సౌకర్యాలతో పాటు సిబ్బంది తీసుకుంటున్న చర్యల గురించి వాకబు చేశారు. అలానే పేషెంట్‌తో పాటు వచ్చిన వారు వేచి ఉండడానికి చేసిన ఏర్పాట్లపై చర్చించారు. పలువురు పేషెంట్లను పరామర్శించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.  

ఇలా రెండు గంటలకు పైగా హాస్పిటల్‌లోని వివిధ విభాగాలను స్వయంగా పరిశీలించిన అనంతరం లాక్‌డౌన్ సమయంలోనూ అటు పిమ్మట తీసుకోవాల్సిన చర్యలపై హాస్పిటల్‌లోని కీలక అధికారులు, వైద్యులతో ప్రత్యేకంగా సమావేశమై తగిన సూచనలు చేశారు. ఈ సమావేశంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ CEO డా. ఆర్.వి. ప్రభాకర రావు మరియు మెడికల్ డైరెక్టర్ డా. టియస్ రావులు కోవిడ్ సందర్భంగా తీసుకొంటున్న పలు జాగ్రత్తలను వివరించారు. 

NBK

అనంతరం హాస్పిటల్‌లో పని చేస్తున్న 400 వందలకు పైగా హౌస్ కీపింగ్ సిబ్బందికి సంస్థ తరపున నిత్యావసరుల వస్థువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో శ్రీ నందమూరి బాలకృష్ణ తో పాటు డా. ఆర్.వి.  ప్రభాకర రావు, CEO, BIACH&RI డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI శ్రీ జి రవి కుమార్, COO, BIACH&RI  డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI లతో పాటూ పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.