Sapthagiri : సైకిల్ ఎక్కనున్న సినీ నటుడు సప్తగిరి.. చిత్తూరు జిల్లా నుంచి పోటీకి సిద్ధం..

టాలీవుడ్ కమెడియన్ అండ్ హీరో సప్తగిరి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడట. పది రోజుల్లో మరిన్ని వివరాలు తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. చిత్తూరు జిల్లా నుంచి పోటీకి..

Sapthagiri : సైకిల్ ఎక్కనున్న సినీ నటుడు సప్తగిరి.. చిత్తూరు జిల్లా నుంచి పోటీకి సిద్ధం..

Tollywood comedian Sapthagiri ready to join Telugu Desam Party

Updated On : June 12, 2023 / 3:30 PM IST

Sapthagiri – TDP : టాలీవుడ్ యాక్టర్ సప్తగిరి రాజకీయ రంగప్రవేశం చేయడానికి సిద్దమవుతున్నాడు. కమెడియన్ గా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గర అయిన సప్తగిరి.. హీరోగా కూడా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. చిత్తూరు జిల్లాలోని ఐరాల అనే చిన్న గ్రామం నుంచి వచ్చి నటుడిగా దాదాపు 100 పైగా సినిమాల్లో నటించిన సప్తగిరి.. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి సేవ చేస్తా అంటున్నాడు. త్వరలోనే సప్తగిరి తెలుగుదేశం పార్టీలో (TDP) చేరబోతున్నాడట. ఈ విషయం గురించి వెల్లడిస్తూ సప్తగిరి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Vijay Deverakonda : విజయ్ వల్ల పూజా హెగ్డేకి మూవీ మిస్.. మరో ఆఫర్‌తో అందుకునే ప్రయత్నం..

తెలుగుదేశం పార్టీ అంటే తనకి ఇష్టమని, ఆ పార్టీ నుంచి తనకి ఆఫర్ ఉందని, పది రోజుల్లో మరిన్ని వివరాలు తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu) పాలన మరియు అభివృద్ధి విజన్ చూస్తూ పెరిగినట్లు, ఆయన ఆదేశిస్తే ఏమీ చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. తాను పుట్టింది చిత్తూరు జిల్లా ఐరాలలోనే అని, అక్కడ పేదల కష్టాలు తనకి పూర్తిగా తెలుసని, ఆ ప్రజలకు సేవచేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా తన వంతు కృషి చేస్తాను వెల్లడించాడు.

Janasena State Office : జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ హోమం.. పార్టీ నేతలకు లేని ఆహ్వానం

తెలుగుదేశం పార్టీ నుంచి చిత్తూరు జిల్లాలోని పార్లమెంటు స్థానానికి గాని, అసెంబ్లీ స్థానానికి గాని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు, టీడీపీ అధికారంలో రావడానికి అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి కూడా సిద్ధమని వెల్లడించాడు. ఇటీవలే నారా లోకేశ్ (Nara Lokesh) ని కూడా కలిసినట్లు తెలియజేశాడు. ఇక ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. మరి 10 రోజుల్లో సప్తగిరి ఎటువంటి వార్త చెబుతాడో చూడాలి. కాగా సప్తగిరి ప్రస్తుతం టాలీవుడ్ లోని పలు పెద్ద సినిమాల్లో నటిస్తున్నాడు.