Vaddepalli Srtinivas : సినీ పరిశ్రమలో విషాదం.. ‘గబ్బర్ సింగ్’ సింగర్ కన్నుమూత..
టాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

Tollywood Folk Singer Vaddepalli Srinivas Passes Away
Vaddepalli Srtinivas : టాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ జానపద నేపథ్య గాయకుడు, సింగర్, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత, గబ్బర్ సింగ్ మూవీ ఫేమ్ వడ్డేపల్లి శ్రీనివాస్ నేడు ఉదయం కన్నుమూశారు.
టాలీవుడ్ లో దాదాపు 100కి పైగా సాంగ్స్, ప్రైవేట్ గా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడిన వడ్డేపల్లి శ్రీనివాస్ 2012లో గబ్బర్ సింగ్ సినిమాలో ‘గన్నులాంటి పిల్ల..’ సాంగ్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈ పాటకి ఫిలింఫేర్ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.
Also Read : Naga Babu : నేను ఎవర్నీ అలా కావాలని అనలేదు.. క్షమాపణలు చెప్పిన నాగబాబు..
గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు ఉదయం మరణించారు. దీంతో సినీ పరిశ్రమ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు ఇస్తున్నారు.