Tollywood : తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసిన టాలీవుడ్ సినీ ప్రముఖులు..
తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసిన టాలీవుడ్ సినీ ప్రముఖులు. సినీ పరిశ్రమకి సంబంధించిన పలు విషయాలను, సమస్యలను..

Tollywood Producers met Telangana new Cinematography Minister Komatireddy Venkat Reddy
Tollywood : తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది. దీంతో సినీ పరిశ్రమకి కొత్త మంత్రి కూడా వచ్చారు. తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భాద్యతలు తీసుకున్నారు. అయితే మంత్రిగా పదవి చేపట్టిన తరువాత.. టాలీవుడ్ నుంచి తనకి ఏ అభినందనలు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. కేవలం దిల్ రాజు మాత్రమే పదవి చేపట్టినందుకు అభినందించారని, మిగిలిన టాలీవుడ్ ప్రముఖులెవ్వరు తనని విష్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ విషయాన్ని కోమటిరెడ్డి ప్రెస్ మీట్ లోని చెబుతూ.. “టాలీవుడ్ లెక్కలనీ త్వరలోనే తెలుస్తా” అని వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఆ కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇక తాజాగా టాలీవుడ్ లోని ప్రముఖులు మంత్రి కోమటిరెడ్డిని కలుసుకొని ఆయనకు అభినందనలు తెలియజేశారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఆధ్వర్యంలో పలువురు ముఖ్య నిర్మాతలు, ఆర్టిస్ట్‌లు, డైరెక్టర్స్ కోమటిరెడ్డిని కలుసుకొని విషెస్ తెలియజేశారు. ఈ సమావేశంలో రాఘవేంద్రరావు, సి కళ్యాణ్, సురేష్ బాబు, నట్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also read : Salaar : కేజీఎఫ్‌కి చేసిన తప్పునే సలార్‌కి కూడా చేశానంటున్న ప్రశాంత్ నీల్..
ఇక ఈ మీటింగ్ లో సినీ పరిశ్రమకి సంబంధించిన పలు విషయాలను, సమస్యలను కోమటిరెడ్డితో చర్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సమావేశానికి చెందిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి నిర్మాతలు వంతు అయ్యిపోయింది. ఇండస్ట్రీలోని అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ కూడా కోమటిరెడ్డిని కలిసి అభినందనలు తెలియజేస్తారేమో చూడాలి.