Tollywood Promotions : ప్రమోషన్స్ లో కొత్త ట్రెండ్ తెస్తున్న టాలీవుడ్.. ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి..

సినిమాకు పబ్లిసిటీ పెంచేందుకు నానా తంటాలు పడుతున్నారు.

Tollywood Promotions : ప్రమోషన్స్ లో కొత్త ట్రెండ్ తెస్తున్న టాలీవుడ్.. ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి..

Tollywood Promotions gest New Trend Heros and Directors Hard Working for Promotions

Updated On : March 9, 2025 / 2:04 PM IST

Tollywood Promotions : ఒకప్పుడు కొత్త సినిమా వస్తే థియేటర్లు జాతరను తలపించేవి. ఇప్పుడలా కాదు. హిట్ టాక్ వస్తేనే టాకీస్ లు కళకళలాడుతున్నాయి. కొత్త మూవీ థియేటర్ లో దిగిపోగానే ప్రేక్షకులు టపీమని వాలిపోవడం లేదు. పోస్టర్లను చూసి జనాలు థియేటర్లకు వచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. అందుకే ఆడియెన్స్ ని రప్పించేందుకు హీరోలు కొత్త కొత్త స్ట్రాటజీలు అప్లై చేస్తున్నారు. ఒక్కో డైరెక్టర్ ఒక్కో ఫార్మూలా ఫాలో అవుతున్నారు. సినిమాకు పబ్లిసిటీ పెంచేందుకు నానా తంటాలు పడుతున్నారు.

సినిమాలు ఎవరైనా తీస్తారు.. కానీ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించిన వారే సక్సెస్ కొట్టినట్టు. ఒకప్పుడు వాల్ పోస్టర్లు అంటిస్తే చాలు.. వాటిని చూసి జనాలు థియేటర్లలో వాలిపోయేవారు. కానీ ఇప్పుడులా కాదు థియేటర్లకు జనాలు క్యూ కట్టాలంటే సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. కావాల్సినంత పబ్లిసిటీ పెంచాలి. అప్పుడు కానీ ప్రేక్షకులు థియేటర్ల వైపు కదలడం లేదు. అందుకే హీరోలు వెరైటీ ప్రమోషన్స్ బాట పట్టారు.

Also Read : Anchor Rashmi : అస్థికలను గోదావరిలో కలిపి ఎమోషనల్ పోస్ట్ చేసిన యాంకర్ రష్మీ.. ఎవరి అస్థికలు అంటే..

తాజాగా న్యాచురల్ స్టార్ నాని ఓ మైండ్ గేమ్ అప్లై చేశారు. నాని తన ఓన్ ప్రొడక్షన్ హౌజ్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై కోర్ట్ అనే సినిమాను తీశారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నాని.. ప్రమోషన్ కోసం కొత్తదారిని ఎంచుకున్నారు. కోర్ట్ కథ అందరు చూడాల్సిన సినిమా అని చెప్పి కోర్ట్ సినిమా నచ్చకపోతే తన నెక్స్ట్ మూవీ హిట్-3 చూడొద్దన్నారు నాని. సినిమా బాగుంటే నాని చెప్పినా చెప్పకున్నా మౌత్ టాక్ తో జనాలు థియేటర్లకు క్యూ కడతారు. ఈ విషయం నాని కి సైతం తెలియంది కాదు. బలమైన ఓపెనింగ్ తీసుకురావడమే లక్ష్యంగా నాని ఈ కామెంట్స్ చేశారు.

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఇదే స్ట్రాటజీని అప్లై చేశాడు. కిరణ్ అబ్బరం నటించిన దిల్ రుబా సినిమా మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారితీస్తున్నాయి. దిల్ రూబా సినిమాకి మీ లవర్‌తోపాటు మీ ఎక్స్ తో కలిసి రండి అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సినిమాపై యూత్ లో మైలేజ్ పెంచడానికి కిరణ్ అబ్బవరం స్ట్రాటజీ అంటూ సోషల్ మీడియా కామెంట్లు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా స్టోరీ ముందే గెస్ చేస్తే ఈ సినిమాలో వాడిన బైక్ గెలుచుకోవచ్చి అనే కాంటెస్ట్ పెట్టారు.

Also Read : Nandini Reddy : అబ్బాయిల మీద కూడా కొంతమంది అమ్మాయిలు తప్పుడు కేసులు పెడుతున్నారు.. డైరెక్టర్ నందిని రెడ్డి కామెంట్స్..

కొందరు హీరోలు కామెంట్స్ తో సినిమాకు హైప్ తీసుకువస్తుంటే మరికొందరు మాత్రం వెరైటీ ప్రమోషన్స్ తో చెలరేగిపోతున్నారు. సంక్రాంతి వస్తున్నాం టీమ్ చేసిన ఫన్నీ స్కిట్స్ సినిమా సక్సెస్ కి ఎంత బూస్ట్ ఇచ్చాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇదే ఫార్ములాను రాబిన్ హుడ్ టీమ్ ఫాలో అవుతోంది. దర్శకుడు వెంకీ కుడుములతో చేసిన ఫన్నీ వీడియోను హీరో నితిన్‌ షేర్‌ చేశాడు. ఆ వీడియోలో వెంకీ కుడుముల ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేద్దాం అంటూ నితిన్‌ వెంట పడుతున్నాడు. ఆయన టార్చర్ భరించలేక సరే ప్రమోషన్ మొదలు పెడతాం అంటాడు నితిన్. మొత్తానికి సినిమా ప్రమోషన్స్ మరింత స్పీడ్‌గా చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. ఈ మూవీ మార్చి 28న రిలీజ్ కాబోతోంది. దీంతో జనాల్ని థియేటర్లను రప్పించేందుకు ప్రమోషన్ స్కిట్లను గట్టిగానే ప్లాన్ చేసింది మూవీ యూనిట్.

గత నెలలో రిలీజైన మజాకా మూవీ కూడా డిఫరెంట్ గా ప్రమోషన్ చేశారు. రాములమ్మ పాట షూటింగ్ ను లైవ్ ద్వారా ప్రేక్షకులకు చూపించారు. పాట మేకింగ్ టైమ్ లో నటీనటులు ఏవిధంగా వర్క్ చేస్తారో చూపించారు. మరోవైపు మజాకా టీమ్ డిఫరెంట్ స్కిట్లతో కూడా ప్రేక్షకులను మెప్పించించింది. ఇలా చాలా మంది హీరోలు, డైరెక్టర్లు.. ఆడియెన్స్ ని థియేటర్లకు రప్పించేందుకు కొత్త కొత్త ఫార్ములాలను అప్లై చేస్తున్నారు. అయితే ఎన్ని ప్లాన్లు వేసినా.. ఎంత స్ట్రాటజీ వాడినా.. సినిమాకి కథే హీరో.. కంటెంట్ ఖతర్నాక్ గా ఉంటే ప్రేక్షకులే గుంపులు గుంపులుగా థియేటర్లకు కదిలివస్తారు. ఇదే వాస్తవమని ఎన్నో సినిమాలు నిరూపించాయి.