Anchor Rashmi : అస్థికలను గోదావరిలో కలిపి ఎమోషనల్ పోస్ట్ చేసిన యాంకర్ రష్మీ.. ఎవరి అస్థికలు అంటే..
తాజాగా యాంకర్ రష్మీ అస్థికలను తీసుకొచ్చి రాజమండ్రి గోదావరి నదిలో కలిపింది. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Anchor Rashmi Gautam mixed her Chutki ashes in the Godavari River Video goes Viral
Anchor Rashmi : సాధారణంగా ఎవరైనా చనిపోతే వారి అస్థికలను పుణ్య నదులు, సముద్రాల్లో కలుపుతూ ఉంటారు. తాజాగా యాంకర్ రష్మీ అస్థికలను తీసుకొచ్చి రాజమండ్రి గోదావరి నదిలో కలిపింది. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇంతకీ రష్మి ఎవరి అస్థికలు గోదావరి నదిలో కలిపిందో తెలుసా? యాంకర్ రష్మీ తన పెంపుడు కుక్క చుట్కీ అస్థికలు గోదావరి నదిలో కలిపింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం రష్మీ పెంపుడు కుక్క చుట్కీ మరణించింది. గతంలోనే రష్మీ ఈ విషయాన్ని తెలిపి ఎమోషనల్ అయింది. తాజాగా తాను ఎంతగానో ప్రేమగా చూసుకున్న కుక్క చుట్కీ అస్థికలు రాజమండ్రికి తీసుకు వచ్చి గోదావరి నదిలో కలిపింది.
ఆ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది. మీరు కూడా రష్మీ తన పెంపుడు కున్న చుట్కీ అస్థికలు గోదావరి నదిలో కలిపిన వీడియో చూసేయండి..
ఈ వీడియోని షేర్ చేసి రష్మీ.. నిన్ను ప్రేమించే అవకాశం కోసం జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను. పునర్జన్మ ఉంటే నువ్వు బాధ లేకుండా పుడతావని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఫ్రీగా వెళ్ళు చుట్కీ గౌతమ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
Also Read : Nagababu : నాగబాబుకి ఉన్న ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసా? చిరు, పవన్ దగ్గర కూడా అప్పు చేశాడంట.. ఎంతంటే..?
యాంకర్ రష్మీకి కుక్కలు అంటే ప్రేమ అని తెలిసిందే. రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో కుక్కల గురించి పోస్టులు చేస్తూ ఉంటుంది. రోడ్డుపై అనాథ కుక్కలకు ఫుడ్ పెడుతుంది. పలు కుక్కలను పెంచుకుంటూ ఉంటుంది.