Nandini Reddy : అబ్బాయిల మీద కూడా కొంతమంది అమ్మాయిలు తప్పుడు కేసులు పెడుతున్నారు.. డైరెక్టర్ నందిని రెడ్డి కామెంట్స్..
ఉమెన్స్ డే సందర్భంగా డైరెక్టర్ నందిని రెడ్డి 10 టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు అంశాలు మాట్లాడారు.

Director Nandini Reddy Comments about fake cases on Men in Womens Day Interview
Nandini Reddy : ఇటీవల పలువురు అమ్మాయిలు అబ్బాయిల మీద ఫేక్ కేసులు పెడుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాము. అమ్మాయిలకు సపోర్ట్ గా పలు చట్టాలు ఉండటంతో కొంతమంది అబ్బాయిల మీద ఫేక్ కేసులు పెడుతున్నారు. ఇటీవల అలాంటివి చాలానే బయటకు వస్తున్నా బయటకు రానివి కూడా చాలా ఉన్నాయి. తాజాగా దీనిపై డైరెక్టర్ నందిని రెడ్డి కామెంట్స్ చేసారు.
నిన్న ఉమెన్స్ డే సందర్భంగా డైరెక్టర్ నందిని రెడ్డి 10 టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు అంశాలు మాట్లాడారు. అయితే అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు కొంతమంది అమ్మాయిల వల్ల అబ్బాయిలు కూడా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అనే ప్రశ్నకు నందిని రెడ్డి సమాధానమిచ్చింది.
Also Read : Nagababu : నాగబాబుకి ఉన్న ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసా? చిరు, పవన్ దగ్గర కూడా అప్పు చేశాడంట.. ఎంతంటే..?
డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ.. చట్టం ఈక్వల్ గానే చూడాలి. ఆ చట్టాల్లోనే కొంత మార్పు రావాలి. ఒకరిని సరిచేయడానికి చట్టం అంతా ఒకవైపు ఉంటే ఇలాంటివి జరుగుతాయి. కొంతమంది అబ్బాయిల వల్ల అమ్మాయిలు సఫర్ అవుతున్నట్టు కొంతమంది అమ్మాయిల వల్ల కూడా అబ్బాయిలు సఫర్ అవుతున్నది నిజమే. అబ్బాయిల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా అలా సఫర్ అవుతున్నారు. నాకు తెలిసిన కొంతమంది మీద తప్పుడు కేసులు పెట్టారు. కొంతమంది అమ్మాయిలు ఈ రూల్ తో నీ మీద కేసు వేస్తాం అని బెదిరిస్తున్నారు. దీని మీద పబ్లిక్ అవేర్ నెస్ కూడా ఉండాలి అని అన్నారు. దీంతో నందిని రెడ్డి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
నందిని రెడ్డి ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..