Sarath Babu : సినీ నటుడు శరత్ బాబు అంత్యక్రియలు పూర్తి..
శరత్ బాబు నిన్న (మే 22) హైదరాబాద్ హాస్పిటల్ లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నేడు చెన్నైలోని ఇండస్ట్రియల్ శ్మశాన వాటికలో శరత్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు.

tollywood senior actor Sarath Babu funeral is completed
Sarath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు నిన్న (మే 22) హైదరాబాద్ హాస్పిటల్ లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు చికిత్స పొందుతూ వస్తున్నారు. ఇక గత నెల 21న అయన ఆరోగ్యం పరిస్థితి విషయమించడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ (AIG) ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతూ వస్తున్న ఆయన.. మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడంతో నిన్న తుది శ్వాస విడిచారు.
ఆయన మరణంతో సినీ పరిశ్రమ మొత్తం తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యింది. తెలుగు, తమిళ, కన్నడ సినీ ప్రముఖులు అంతా శరత్ బాబు మరణానికి చింతిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. ఇక నిన్న రాత్రి వరకు అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్(Hyderabad) ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. అనంతరం నిన్న రాత్రే శరత్ బాబు భౌతికకాయాన్ని చెన్నైకు తరలించారు. నేడు చెన్నైలోని ఇండస్ట్రియల్ శ్మశాన వాటికలో శరత్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు.

tollywood senior actor Sarath Babu funeral is completed
Bichagadu 3 : బిచ్చగాడు 3 ని కన్‌ఫార్మ్ చేసిన విజయ్ ఆంటోనీ.. 2025లో సినిమా!
కాగా శరత్ బాబు సినీ పరిశ్రమలోకి వద్దామని అసలు అనుకోలేదు. చిన్ననాటి నుంచి IPS అధికారి అవ్వాలని కలగన్నారు. కానీ కంటి సమస్య వల్ల ఆ కల కలగానే మిగిలిపోవడంతో సినిమా రంగం వైపు అడుగులు మలుపు తిరిగాయి. 1973లో ‘రామరాజ్యం’ సినిమాలో హీరోగా నటించి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శరత్ బాబు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో 220 కి పైగా సినిమాల్లో నటించారు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ వచ్చిన శరత్ బాబు.. 8 నంది అవార్డులను సైతం అందుకున్నారు.

tollywood senior actor Sarath Babu funeral is completed