Senior Hero’s : నాగార్జున ఉంటే బాలయ్య ఉండడు.. బాలయ్య ఉంటే నాగార్జున ఉండడు.. మళ్ళీ సీనియర్ హీరోల ఫోటో వైరల్..

తాజాగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ముగ్గురు కలిసి ఓ ఇండస్ట్రీ సన్నిహిత వ్యక్తి ఇంట్లోని ఈవెంట్ కు వెళ్లారు.

Senior Hero’s : నాగార్జున ఉంటే బాలయ్య ఉండడు.. బాలయ్య ఉంటే నాగార్జున ఉండడు.. మళ్ళీ సీనియర్ హీరోల ఫోటో వైరల్..

Tollywood Senior Hero's Chiranjeevi Nagarjuna Venkatesh Photo goes Viral Balakrishna Missing

Updated On : February 5, 2025 / 12:54 PM IST

Tollywood Senior Hero’s : మన సీనియర్ స్టార్ హీరోలు, టాలీవుడ్ నాలుగు స్థంబాలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ.. కలిసి కనిపిస్తే ఆ ఆనందమే వేరు. ఈ నలుగురు కలిసి అప్పుడెప్పుడో వజ్రోత్సవం, టాలీవుడ్ క్రికెట్ మ్యాచుల్లో కనపడ్డారు. మళ్ళీ ఇప్పటివరకు నలుగురు కలిసి కనపడలేదు. ఒకవేళ సీనియర్ హీరోలు కలిసినా నాగార్జున, బాలయ్య ఎవరో ఒకరు మిస్ అవుతున్నారు.

తాజాగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ముగ్గురు కలిసి ఓ ఇండస్ట్రీ సన్నిహిత వ్యక్తి ఇంట్లోని ఈవెంట్ కు వెళ్లారు. అక్కడ ముగ్గురు ఎంపీ సీఎం రమేష్ తో కూర్చొని మాట్లాడుతున్న ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో వెంకటేష్, నాగార్జున ట్రెడిషినల్ గా ఉండగా చిరు సింపుల్ గా వచ్చారు. ఇలా సీనియర్ హీరోలు ఒకేసారి కనిపిస్తే వచ్చే కిక్కే వేరు. ఫ్యాన్స్, సినిమా లవర్స్ ఎంతో సంతోషిస్తారు. అయితే ఈ ఫొటోలో బాలయ్య మిస్ అయ్యారు.

Tollywood Senior Hero's Chiranjeevi Nagarjuna Venkatesh Photo goes Viral Balakrishna Missing

Also Read : Thandel Ticket Rates : తండేల్’ టికెట్ రేట్లు ఎంత పెంచారో తెలుసా..? ఏపీలో అడిగినంత హైక్ ఇచ్చారుగా.. తెలంగాణలో మాత్రం..

ఇటీవల సీనియర్ హీరోలు కలిసిన ప్రతిసారి బాలకృష్ణ ఉంటే నాగార్జున మిస్ అవుతున్నారు. నాగార్జున ఉంటే బాలకృష్ణ మిస్ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం బాలయ్య 50 సంవత్సరాల నట ప్రస్థానం ఈవెంట్లో కూడా బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ కలిసి అలరించారు కానీ నాగార్జున మిస్ అయ్యారు. అంతకుముందు కూడా ఓ ఈవెంట్లో చిరు, నాగ్, వెంకటేష్ కలిసి కనపడ్డారు బాలయ్య మిస్ అయ్యారు.

Tollywood Senior Hero's Chiranjeevi Nagarjuna Venkatesh Photo goes Viral Balakrishna Missing

దీంతో సీనియర్ హీరోల మీటింగ్ ఆసక్తికర చర్చగా మారింది. ఎప్పుడు చూసిన ముగ్గురు హీరోలే కనిపిస్తున్నారు, నలుగురు కలిసి ఎప్పుడు కనిపిస్తారు? బాలయ్య ఉంటే నాగార్జున ఉండట్లేదు? నాగార్జున ఉంటే బాలయ్య ఉండట్లేదు? అనుకోకుండా ఇలా జరుగుతుందా? లేక వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి సీనియర్ హీరోల ఫోటోలు అయితే వైరల్ అవుతున్నాయి కానీ నలుగురు కలిసి కనిపిస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్, సినిమా లవర్స్.

Also Read : Allu Arjun Remuneration : బన్నీ 300 కోట్ల రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. పుష్ప కోసం.. ఈయన చెప్పిన లెక్క వింటే..

ఇక నలుగురు హీరోలు ఎంత సీనియర్ అయినా యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి త్వరలో విశ్వంభర సినిమాతో రాబోతున్నారు. మరో మూడు సినిమాలను లైన్లో పెట్టారు. బాలకృష్ణ వరుసగా నాలుగు హిట్స్ కొట్టారు. ఇటీవలే డాకు మహారాజ్ సినిమాతో హిట్ కొట్టి ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇక నాగార్జున కుబేర, కూలి సినిమాలతో బిజీగా ఉన్నారు. వెంకీమామ ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు.