Toxic Cast Remunerations : టాక్సిక్ స్టార్ల రెమ్యూనరేషన్స్.. ఓరి నాయనో మీడియం బడ్జెట్ సినిమాలు 3 లేదా 4 తీయొచ్చు?
Toxic Cast Remunerations : టాక్సిక్ చిత్రంలో నటిస్తున్న ప్రధాన నటీనటులు అందుకుంటున్న పారితోషికాలు ఇవే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది
Toxic Movie actors Remunerations details viral on social media
Toxic Cast Remunerations : కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, యష్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బస్రూర్ సంగీతాన్ని అందిస్తుండగా.. ఏకంగా ఐదుగురు హీరోయిన్లు రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియాలు నటిస్తున్నారు.
అక్షయ్ ఒబెరాయ్. బియాట్రిజ్ తౌఫాన్‌బచ్, డెరిల్ డీ సిల్వ, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ, టోవినో థామస్, కైల్ పాల్లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం 26 ఆగస్టు 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.
Rukmini Vasanth : అందాల చందమామ.. రుక్మిణి వసంత్ ఫోటోలు..
కాగా.. ఈ చిత్రంలో నటిస్తున్న ప్రధాన నటీనటులు అందుకుంటున్న పారితోషికాలు ఇవే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వార్త ప్రకారం.. ఈ చిత్రంలో అందరి కంటే ఎక్కువ పారితోషికాన్ని హీరో యశ్ అందుకుంటున్నాడట. అతడు ఏకంగా 50 కోట్ల మొత్తాన్ని తీసుకుంటున్నాడట. అంతేకాదండోయ్.. ప్రాఫిట్స్ లో లాభాలు వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడట.
నాడియా పాత్రలో కనిపించనున్న కియారా అద్వానీకి 15 కోట్లు, గంగ పాత్రను పోషిస్తున్న నయనతారకు 12 కోట్లు నుంచి 18 కోట్లు అందుకోనున్నారట. రుక్మిణి వసంత్ కి 3 కోట్లు, తారా సుతారియా, హ్యూమా ఖురేషిలకు రెండు కోట్ల చొప్పున ఇస్తున్నారట. దర్శకురాలు, సాంకేతిక నిపుణులతో కలిపి పారితోషికాలే వంద కోట్లు దాటిందట.
ఈ రెమ్యునరేషన్ వివరాలు అధికారికం కావు. గానీ ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
