Trisha: అడిగే విధానం మార్చుకోవాలంటున్న త్రిష..

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ లో త్రిష ఒకరు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో ఆమె పలు విజయవంతమైన తమిళ, తెలుగు చిత్రాలలో నటించింది. అయితే, ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో త్రిష నిశ్చితార్థం జరిగింది కానీ పెళ్లికి ముందే నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఆమె ఇప్పటివరకు పెళ్లి మాట తీసుకురాలేదు.

Trisha: అడిగే విధానం మార్చుకోవాలంటున్న త్రిష..

Trisha Serious About Her Marriage Discussions

Updated On : October 9, 2022 / 8:26 PM IST

Trisha: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ లో త్రిష ఒకరు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో ఆమె పలు విజయవంతమైన తమిళ, తెలుగు చిత్రాలలో నటించింది. అయితే, ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో త్రిష నిశ్చితార్థం జరిగింది కానీ పెళ్లికి ముందే నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఆమె ఇప్పటివరకు పెళ్లి మాట తీసుకురాలేదు.

Trisha : వెబ్‌సిరీస్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న త్రిష

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించగా, ఆమె బదులిస్తూ.. “నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రజలు నన్ను తరచుగా అడుగుతున్నారు. ఇప్పటికే నాకు పెళ్లి జరగాల్సి ఉందని అంటున్నారు. వారు అడిగే విధానం నాకు నచ్చలేదు. మీరు సాధారణంగా నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని అడిగితే, మీకు సమాధానం వస్తుంది.

నాకు విడాకుల మీద నమ్మకం లేదు. పెళ్లయ్యాక విడాకులు తీసుకోవాలనుకోవడం లేదు. నా చుట్టూ ఉన్న అనేక మంది వివాహిత జంటలు తమ వివాహం పట్ల అసంతృప్తిగా ఉంటున్నారు. వారిలో కొందరు నా స్నేహితులు. చిన్న చిన్న కారణాల వల్ల వారు విడిపోడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. నేను అలాంటి వరుసలో ఉండాలనుకోలేదు’ అని త్రిష పేర్కొంది.