Guntur Kaaram : గుంటూరు కారం షూటింగ్ అయిపోయిందా? అప్పుడే డబ్బింగ్ మొదలుపెట్టి..
ఇంకా గుంటూరు కారం షూటింగ్ జరుగుతుందనే సమాచారం. కానీ తాజాగా గుంటూరు కారం డబ్బింగ్ వర్క్ మొదలైందని ఓ ఫొటో వైరల్ గా మారింది.

Trivikram Mahesh Babu Guntur Kaaram Movie Update Dubbing Works Started
Guntur Kaaram Update : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో మూడోసారి రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా మాత్రం ఇప్పటికే అనేక కారణాలతో పలుసార్లు వాయిదా పడింది. సినిమా నుంచి పలువురు తప్పుకున్నారు. కానీ గుంటూరు కారం సినిమా ఎలాగైనా సంక్రాతికి(Sankranthi) వస్తుందని మహేష్ బాబు, నిర్మాతలు ఇటీవల క్లారిటీ ఇచ్చారు.
ఇంకా గుంటూరు కారం షూటింగ్ జరుగుతుందనే సమాచారం. కానీ తాజాగా గుంటూరు కారం డబ్బింగ్ వర్క్ మొదలైందని ఓ ఫొటో వైరల్ గా మారింది. డబ్బింగ్ మొదలు పెట్టేముందు స్టూడియోలో నిర్మాత, త్రివిక్రమ్ పూజ చేయించిన ఫొటో వైరల్ గా మారింది. గుంటూరు కారం డబ్బింగ్ పనులు మొదలుపెట్టారని సమాచారం. దీంతో షూటింగ్ మొత్తం అయిపోయిందా లేక షూటింగ్ జరుగుతుండగానే ఇంకో పక్క డబ్బింగ్ పనులు కూడా చేస్తున్నారా అనే సందేహాలు అభిమానులకు కలుగుతున్నాయి.
ఇక ఓ మహేష్ అభిమాని గుంటూరు కారం అప్డేట్ గురించి థమన్ ని అడగగా.. నవంబర్, డిసెంబర్, జనవరి.. వచ్చే మూడు నెలలు మనవే అంటూ సినిమాపై హైప్ పెంచారు. ఇక గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు చిత్రయూనిట్.