Trivikram – Pawan Kalyan : పవన్ – త్రివిక్రమ్ కలిసి మంగళగిరి జనసేన ఆఫీస్‌కి.. దేనికోసం ఈ సమావేశం?

తాజాగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో కలిసి మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ కి వెళ్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Trivikram – Pawan Kalyan : పవన్ – త్రివిక్రమ్ కలిసి మంగళగిరి జనసేన ఆఫీస్‌కి.. దేనికోసం ఈ సమావేశం?

Trivikram Pawan Kalyan and some Friends went to Janasena Mangalagiri Office Meeting goes Viral

Trivikram – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ మంచి స్నేహితులు అని అందరికి తెలిసిందే. గతంలో పవన్ కళ్యాణ్ కి పొలిటికల్ స్క్రిప్ట్స్ కూడా త్రివిక్రమ్ రాసిచ్చేవాడని పలువురు కామెంట్స్ చేసారు. ఇక పవన్ సినిమాల్లో త్రివిక్రమ్ ప్రమేయం ఉంటుందని కూడా అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరూ పవన్ కళ్యాణ్ ఎన్నికల బిజీ వల్ల ఎక్కువగా కలవలేదు, కలిసి కనపడలేదు.

కానీ తాజాగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో కలిసి మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ కి వెళ్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్, నర్ర శ్రీనివాస్, నాగ శ్రీనివాస్, ఆనంద సాయి.. ఇలా పవన్ సన్నిహితులు అంతా కలిసి గన్నవరం వెళ్లారు.

Also Read : Harish Sajja – Mahesh Babu : స్టార్ డిస్ట్రిబ్యూటర్ కన్నుమూత.. మహేష్ కి ఫస్ట్ టైం ఆ రికార్డ్ ఇచ్చింది అతనే..

గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన మంగళగిరి పార్టీ కార్యాలయానికి వీరందరితో కలిసి బయలుదేరారు పవన్ కళ్యాణ్. వీరితో జనసేన పార్టీ ఆఫీస్ లో పవన్ సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. నేడు జనసేన పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్మానం చేయనున్నారు. అయితే త్రివిక్రమ్, మిగతా వాళ్లంతా ఈ ఈవెంట్ కి వచ్చారా? లేకా ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా? సినిమా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? లేదా ఏపీ అభివృద్ధి కోసం త్రివిక్రమ్ సలహాలు పవన్ తీసుకోబోతున్నాడా అని చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ గెలిచాక త్రివిక్రమ్ జనసేన పార్టీ ఆఫీస్ కి వెళ్లడం ఆసక్తిగా మారింది.