Akhanda Trailer Roar : ‘అఖండ’ ట్రైలర్‌లో త్రివిక్రమ్!..

బాలయ్య ‘అఖండ’ ట్రైలర్‌లో త్రివిక్రమ్‌ని భలే కనిపెట్టేశారుగా!..

Akhanda Trailer Roar : ‘అఖండ’ ట్రైలర్‌లో త్రివిక్రమ్!..

Trivikram

Updated On : November 16, 2021 / 4:30 PM IST

Akhanda Trailer Roar: ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’. రెండు టీజర్స్, రెండు లిరికల్ సాంగ్స్‌కి భారీ స్పందన వచ్చింది.

Balakrishna – Jr NTR : నందమూరి ఫ్యాన్స్‌‌కి గుడ్‌న్యూస్.. త్వరలో ఒకే వేదికపై బాబాయ్-అబ్బాయ్..

ఇక రీసెంట్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ‘అఖండ ట్రైలర్ రోర్’ పేరుతో వదిలిన ట్రైలర్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్, తన మార్క్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టేసారు. ‘అఖండ’ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసేసింది.

Akhanda Trailer Roar : ఇదీ బాలయ్య మాస్ ర్యాంపేజ్!

అయితే ట్రైలర్‌లో టాలీవుడ్ స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించారంటూ మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అసలు ‘అఖండ’ లో త్రివిక్రమ్ కనిపించడమేంటని కంగారు పడకుండా కాస్త ఫోకస్ చేసి చూస్తే విషయం అర్థమవుతుంది.

Manchu Lakshmi ‘అఖండ’ డైలాగులు అదరగొట్టిన మంచు లక్ష్మీ.. వీడియో వైరల్..

Guruji

 

ట్రైలర్‌లో ‘నేను ఆత్మ.. వాడు నా శరీరం’ అంటూ బాలయ్య అఘోరా క్యారెక్టర్ గురించి ఒక వ్యక్తి చెప్తాడు. చూడ్డానికి అతను అచ్చు త్రివిక్రమ్‌లానే ఉన్నాడు. దీంతో ఆ వ్యక్తి గురూజీ (త్రివిక్రమ్‌ను అభిమానులు ఈ పేరుతోనే పిలుస్తారు) ఏనా అంటూ నెట్టింట మీమ్స్ భలే వైరల్ అవుతున్నాయి.