Udhayanidhi Stalin : ఇదే నా చివరి సినిమా అంటూ హీరో ప్రకటన.. నోటీసులు పంపిన నిర్మాత..

మామన్నన్‌ తన చివరి సినిమా అని ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. ఇకపై సినిమాలు చేయనని, ఇకపై రాజకీయాల్లోనే, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ఉదయనిధి మామన్నన్‌ సినిమా ప్రమోషన్స్ లో తెలిపారు.

Udhayanidhi Stalin : ఇదే నా చివరి సినిమా అంటూ హీరో ప్రకటన.. నోటీసులు పంపిన నిర్మాత..

Udhayanidhi Stalin announce maamannan is his last movie a producer files petition in court

Updated On : June 25, 2023 / 9:59 AM IST

Udhayanidhi Stalin :  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, తమిళ్ హీరో ఉదయనిధి స్టాలిన్ గతంలో కొన్ని సినిమాలు చేసి సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చాడు. ఇటీవల ఎమ్మెల్యేగా కూడా ఎన్నికై ప్రస్తుతం తమిళనాడు మంత్రివర్గంలో పదవిలో కూడా ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ జంటగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయనిధి సొంత నిర్మాణంలో మామన్నన్‌ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని జూన్ 29న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో మామన్నన్‌ తన చివరి సినిమా అని ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. ఇకపై సినిమాలు చేయనని, ఇకపై రాజకీయాల్లోనే, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ఉదయనిధి మామన్నన్‌ సినిమా ప్రమోషన్స్ లో తెలిపారు. అయితే ఉదయనిధి స్టాలిన్ చివరి సినిమా అనడంతో అభిమానులు నిరాశ వ్యక్తపరుస్తుంటే ఓ నిర్మాత ఉదయనిధిపై కోర్టులో కేసు వేశారు.

తమిళ నిర్మాత రామ శరవణన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన నిర్మాణంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా, ఆనంది, పాయల్ రాజ్‌పుత్ లు హీరోయిన్స్ గా కేఎస్‌.అదయమాన్‌ దర్శకత్వంలో ఏంజెల్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 80 శాతం పూర్తయింది. ఇప్పుడు ఉదయనిధి మామన్నన్ తన చివరి సినిమా అని చెప్తుండటంతో.. ఈ సినిమా కోసం 13 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టాను, నా సినిమా ఎప్పుడు పూర్తవ్వాలి, నా సినిమాని మధ్యలో ఆపేసి మామన్నన్ చేశారని, ఈ సినిమా పూర్తయి రిలీజ్ అవ్వకపోతే తాను చాలా నష్టపోతానని, నా సినిమా షూటింగ్ పూర్తయ్యేవరకు మామన్నన్ విడుదల ఆపాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

Singer Minmini : ఇళయరాజా వల్లే నా కెరీర్ నాశనమైంది.. సింగర్ సంచలన వ్యాఖ్యలు..

దీంతో ఈ కేసుని విచారణ చేపట్టిన కోర్టు ఉదయనిధి స్టాలిన్ కు, రెడ్ జాయింట్ మూవీస్ సంస్థకు నోటీసులు జరీ చేసింది. తదుపరి విచారణ జూన్ 28న హాజరవ్వాలని తెలిపింది. దీంతో ఈ విషయం తమిళ సినీ పరిశ్రమలో చర్చగా మారింది. మరి దీనిపై ఉదయనిధి స్టాలిన్ ఏమని స్పందిస్తాడో చూడాలి.