Unstoppable with NBK: రౌడీ హీరోతో స్పెషల్ ఎపిసోడ్.. ఇది వేరే లెవెల్!

నందమూరి బాలయ్య ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీదనే కాదు డిజిటల్ లో కూడా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అచ్చ తెలుగు ఓటీటీగా పేరు తెచ్చుకున్న ఆహా.. బాలయ్యతో అన్ స్టాపబుల్ షో ప్రకటన..

Unstoppable with NBK: రౌడీ హీరోతో స్పెషల్ ఎపిసోడ్.. ఇది వేరే లెవెల్!

Unstoppable With Nbk

Updated On : November 13, 2021 / 2:47 PM IST

Unstoppable with NBK: నందమూరి బాలయ్య ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీదనే కాదు డిజిటల్ లో కూడా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అచ్చ తెలుగు ఓటీటీగా పేరు తెచ్చుకున్న ఆహా.. బాలయ్యతో అన్ స్టాపబుల్ షో ప్రకటన నుండి ప్రతి ఎపిసోడ్ వేరే లెవెల్ లోనే సెట్ చేస్తుంది. ఇప్పటికే డైలాగ్ కింగ్ మోహన్ బాబు అండ్ ఫ్యామిలీతో పాటు సెక్స్ డోర్ నేచురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న నానీతో రెండు ఎపిసోడ్లతో ఫుల్ ఫన్ పెంచేసిన సంగతి తెలిసిందే.

Maha Samudram : ఓటిటిలో ‘మహా సముద్రం’

కాగా, ఇప్పుడు మూడవ ఎపిసోడ్ అంతకు మించి అనేలేనా సిద్ధం చేస్తున్నారట. మూడవ ఎపిసోడ్ గురించి ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ ఎపిసోడ్ ఓ స్పెషల్ హీరోతో చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ స్పెషల్ హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ. రౌడీ హీరోతో మూడవ ఎపిసోడ్ ను బ్లాస్టింగ్ ఎపిసోడ్ గా.. అంతకు మించి అనేలా సిద్ధం చేస్తున్నారట.

Hero : రిపబ్లిక్ డేకి మహేష్ ఫ్యామిలీ నుంచి ‘హీరో’

బాలయ్యతో విజయ్ దేవరకొండ అన్ స్టాపబుల్ షో అనగానే ఈ సౌండింగ్ నే వేరే లెవెల్లో ఉంది. ఈ ఎపిసోడ్ గురించి ఇటు బాలయ్య అభిమానులతో పాటు విజయ్ అభిమానులలో ఆసక్తి మొదలైంది. ఇక ఈ ఎపిసోడ్ ఇంకెంత ఎనర్జిటిక్ గా ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి ఆహా మాత్రం ఈ షోలో ఎపిసోడ్ ఒకదాన్ని మించి ఒకటి ఇంకో లెవెల్ అనేలా సెట్ చేస్తున్నారు.