Upasana : అనాథ పిల్లలు, మహిళలతో ఉపాసన బతుకమ్మ వేడుకలు.. క్లీంకారతో కలిసి.. మెగాఫ్యామిలిలో పండగ సందడి..
బాలిక నిలయం సేవా సమాజ్(Balika Nilayam Seva Samaj) కి చెందిన అనాథ పిల్లలు, మహిళలతో కలిసి ఉపాసన బతుకమ్మ వేడుకలు జరుపుకుంది.

Upasana and Mega Family Celebrates Bathukamma with Balika Nilayam Seva Samaj
Upasana : మన సెలబ్రిటీలు అంతా దసరా(Dasara) పండుగని, బతుకమ్మ పండుగని గ్రాండ్ గా జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలని, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో కూడా ఘనంగా బతుకమ్మ(Bathukamma) వేడుకలు నిర్వహించారు. మెగా ఫ్యామిలీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల వీడియోని ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బాలిక నిలయం సేవా సమాజ్(Balika Nilayam Seva Samaj) కి చెందిన అనాథ పిల్లలు, మహిళలతో కలిసి ఉపాసన బతుకమ్మ వేడుకలు జరుపుకుంది. ఈ సేవా సమాజ్ ని ఉపాసన వాళ్ళ బామ్మ స్థాపించారు. ఆవిడ లేకపోయినా ఈ సేవా సమాజ్ బాగోగులు అన్ని ప్రస్తుతం ఉపాసననే చేసుకుంటున్నట్టు సమాచారం. అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి పిల్లలతో సరదాగా గడుపుతుంది కూడా. తాజాగా ఈ సేవా సమాజ్ పిల్లలు, మహిళలు ఇంటి ఆవరణలో బతుకమ్మలని ఏర్పాటు చేయగా అందరితో కలిసి బతుకమ్మ ఆడారు మెగా ఫ్యామిలీ.
Also Read : Dasara Updates : దసరాకి మన హీరోలు ఇచ్చిన అప్డేట్స్ ఇవే.. కొత్త పోస్టర్స్, కొత్త లుక్స్..
ఈ బతుకమ్మ వేడుకలలో చిరంజీవి(Chiranjeevi) దంపతులు, చిరంజీవి తల్లి, చరణ్ దంపతులు, సాయి ధరమ్ తేజ్, చిరంజీవి కూతుళ్లు, మనవరాళ్లు.. మరికొంతమంది మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాల్గొన్నారు. ఉపాసన క్లీంకారని కూడా ఈ వేడుకలకు తీసుకొచ్చింది. అక్కడకు వచ్చిన మహిళలకు మెగా ఫ్యామిలీ చీరలను పంచిపెట్టింది. ఈ బతుకమ్మ వేడుకల వీడియోని ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. బాలిక నిలయం సేవా సమాజ్ తో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకోవడం ఆనందంగా ఉంది అంటూ దసరా శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా అందరూ ఉపాసనని అభినందిస్తున్నారు.
View this post on Instagram