Upasana – Ram Charan : సరోగసి వార్తలకు చెక్ పెట్టిన ఉపాసన..
టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు కాబోతున్నారు అంటూ ఇటీవల చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి అయిన పదేళ్ల తరువాత ఇప్పుడు వీరిద్దరూ తల్లిదండ్రులు అవుతుండడంతో.. ఈ స్టార్ కపుల్ సహజ పద్దతిలో కాకుండా సరోగసి ద్వారా పిల్లలని కనబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా పలు సైట్‌లు కథనాలు రాసుకొస్తున్నాయి. కాగా..

Upasana made full stop for surrogacy news
Upasana – Ram Charan : టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు కాబోతున్నారు అంటూ ఇటీవల చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి అయిన పదేళ్ల తరువాత ఇప్పుడు వీరిద్దరూ తల్లిదండ్రులు అవుతుండడంతో.. ఈ స్టార్ కపుల్ సహజ పద్దతిలో కాకుండా సరోగసి ద్వారా పిల్లలని కనబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా పలు సైట్‌లు కథనాలు రాసుకొస్తున్నాయి.
Ram Charan : రామ్‌చరణ్‌పై షారుఖ్ ట్వీట్.. వైరల్ అవుతున్న ట్వీట్!
అయితే ఈ వార్తలన్నిటికి ఒక్క ఫోటోతో చెక్ పెట్టేసింది ఉపాసన. ఫ్యామిలీ పార్టీ ఉండడం వల్ల చరణ్ అండ్ ఉపాసన ఇటీవల థాయ్‌లాండ్‌కు వెళ్లారు. అక్కడ ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న తమ ఇద్దరి ఫోటోలను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అయితే ఆ ఫొటోలో ఉపాసన బేబీ బంప్‌తో కనిపిస్తుంది. దీంతో సరోగసి వార్తలపై నేరుగా స్పందించక పోయినా, ఆ వార్తలకి చెక్ పెట్టినట్లు అయ్యింది.
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శంకర్ సామజిక అంశాలను కమర్షియల్ హంగులతో తెరకెక్కించడంలో దిట్ట. ఈ దర్శకుడి నుంచి అటువంటి సినిమా వచ్చి కూడా చాలా రోజులు అవడంతో, ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ‘ఆర్ఆర్ఆర్’ భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఈ సినిమాతో ఇంకెంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.