Sankranthi 2022 : తెలుగు సినిమాలు.. సంక్రాంతి శుభాకాంక్షలు..

అప్‌కమింగ్ తెలుగు సినిమాల సంక్రాంతి పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

Sankranthi 2022 : తెలుగు సినిమాలు.. సంక్రాంతి శుభాకాంక్షలు..

Telugu Movies Sankranthi

Updated On : January 15, 2022 / 3:33 PM IST

Sankranthi 2022: తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతిని తెలుగు ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో సందడి వేరేలా ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ లాంటి పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయి.

Balakrishna : గుర్రమెక్కిన ‘నటసింహం’.. నందమూరి ‘యువసింహం’..

ఎట్టి పరిస్థితిల్లోనూ సంక్రాంతికే రావాలనుకున్న ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25కి, ‘సర్కారు వారి పాట’ ఏప్రిల్ 1కి షిఫ్ట్ అయిపోయాయి. కట్ చేస్తే.. కింగ్ నాగార్జున మాత్రం డేర్ చేసి ‘బంగార్రాజు’ ని సంక్రాంతి బరిలో దింపారు. రిస్క్ తీసుకున్నారు కాబట్టే రిజల్ట్ అదిరిపోయింది.

Khiladi

ఇక ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో కొత్త పోస్టర్లతో సందడి చేస్తున్నారు మేకర్స్. ‘భీమ్లా నాయక్’, ‘ఖిలాడి’, ‘రామారావు-ON DUTY’, ‘పక్కా కమర్షియల్’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, ‘GOD SE’, ‘ఎఫ్ 3’, ‘రీసౌండ్’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి అప్‌కమింగ్ తెలుగు సినిమాల సంక్రాంతి పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Pakka Commercial