గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన మిస్ యునివర్సల్ ఊర్వశి రౌటేలా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన మిస్ యునివర్సల్ ఊర్వశి రౌటేలా

Updated On : August 23, 2020 / 3:20 PM IST

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ మిస్ యూనివర్సల్ ఊర్వశి రౌటేలా వరకూ చేరింది. ప్రముఖ నటులు ప్రభాస్, విజయ్ లను దాటి దర్శకుడు సంపత్ నందికి చేరిన ఛాలెంజ్‌.. ఊర్వశి రౌటేలాకు చేరింది. దానిని స్వీకరించిన ఆమె జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటింది ఊర్వశి రౌటేలా.

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని అభినందనలు తెలియజేశారు. ప్రముఖ నటులు ప్రభాస్ మహేష్ బాబు విజయ్ లాంటి ప్రముఖులు పాల్గొన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నీను కూడ పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చిన… ఊర్వశి రౌటేలా.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టాలీవుడ్, బాలీవుడ్ వరకూ పాకింది. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు వాళ్లు నాటిన మొక్కలను అభిమానులతో పంచుకున్నారు.