Urvashi Rautela : ఏజెంట్ లో ఐటెం సాంగ్ కోసం మెగాస్టార్ భామ.. అటు రామ్ – బోయపాటి సినిమాలో కూడా..

ఊర్వశి రౌతేలా ఇప్పుడు కేవలం ఐటెం సాంగ్స్ కి స్పెషల్ గా మారిపోతుంది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిగా మెప్పించిన ఐటెం సాంగ్స్ ఆఫర్స్ వస్తుండటంతో వరుసగా ఓకే చేస్తోంది.

Urvashi Rautela : ఏజెంట్ లో ఐటెం సాంగ్ కోసం మెగాస్టార్ భామ.. అటు రామ్ – బోయపాటి సినిమాలో కూడా..

Urvashi Rautela special item song in Akhil agent Movie

Updated On : April 11, 2023 / 9:19 AM IST

Urvashi Rautela : మన కమర్షియల్ సినిమాల్లో కచ్చితంగా ఐటెం సాంగ్స్(Item Song) ఉండాల్సిందే. చాలా వరకు స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఐటెం సాంగ్స్ పెడుతున్నారు. గతంలో ఈ ఐటెం సాంగ్స్ చేయడానికి సపరేట్ గా కొంతమంది డ్యాన్సర్లు ఉన్నా ఇప్పుడు మోడల్స్, డ్యాన్సర్లతో పాటు స్టార్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్(Heroine) ఓ పక్క నటిగా చేస్తూనే మరోపక్క ఐటెం సాంగ్స్ లో డ్యాన్స్ వేస్తున్నారు. ఇక బాలీవుడ్(Bollywood)లో కొంతమంది హీరోయిన్స్ అయితే ఏ సినిమా పరిశ్రమలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినా చేసేస్తున్నారు. అందులో ఇప్పుడు ముందు వరసలో ఉంది ఊర్వశి రౌతేలా(Urvashi Rautela).

ఊర్వశి రౌతేలా ఇప్పుడు కేవలం ఐటెం సాంగ్స్ కి స్పెషల్ గా మారిపోతుంది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిగా మెప్పించిన ఐటెం సాంగ్స్ ఆఫర్స్ వస్తుండటంతో వరుసగా ఓకే చేస్తోంది. బాలీవుడ్ లోనే కాక టాలీవుడ్ లో కూడా వరుసగా ఐటెం సాంగ్స్ కి ఓకే చెప్తోంది ఈ భామ. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ తో అలరించింది ఊర్వశి. ఈ పాట క్లిక్ అవడంతో టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది.

Vakeel Saab 2 : వకీల్ సాబ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నా.. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ మొదలైంది.. వేణు శ్రీరామ్

అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతో ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాలో కూడా ఓ సూపర్ ఐటెం సాంగ్ ని ప్లాన్ చేయగా ఇందులో ఊర్వశి రౌతేలా అఖిల్ తో కలిసి చిందేసినట్లు సమాచారం. ఇటీవలే ఈ సాంగ్ షూట్ కూడా పూర్తయింది. మరి ఊర్వశి అయ్యగారి పక్కన ఏ రేంజ్ లో మెరిపించిందో చూడాలి. అలాగే రామ్ బోయపాటి కాంబోలో వస్తున్న మాస్ సినిమాలో కూడా ఊర్వశి రౌతేలాకు ఓ స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చిందని సమాచారం. ఇలా ఊర్వశి టాలీవుడ్ లో వరుస ఐటెం సాంగ్స్ ఆఫర్స్ అందుకుంటుంది. భవిష్యత్తులో ఇంకెన్ని ఐటెం సాంగ్స్ లో తన డ్యాన్స్ తో ప్రేక్షకులని అలరిస్తుందో చూడాలి.